Natyam ad

పుంగనూరులో స్వాతంత్య్ర వేడుకలు 

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఆదివారం వై భవంగా నిర్వహించారు. వాల్మీకి సంఘనాయకులు , విశ్రాంత డిఎస్పీ సుకుమార్‌బాబు, అద్దాల నాగరాజ ఆధ్వర్యంలో జాతీయ జెండాలను పంపిణీ చేసి హర్‌ఘర్‌ తిరంగాలో భాగస్వామ్యులుకావాలని పిలుపునిచ్చారు. అలాగే నానబాలవీధిలో కౌన్సిలర్‌ నయింతాజ్‌, మైనార్టీల నాయకులు ఇంతియాజ్‌, గౌస్‌, సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు కలసి జెండాలను ఇంటింటా కట్టించారు. మండలంలోని తమ్మరాజుపల్లెలో వలంటీర్‌ ఎం.బాబు ఇంటింటికి వెళ్లి జెండాలను పంపిణీ చేశారు. అలాగే బిజెపి రాష్ట్ర మోర్చా కార్యదర్శి అయూబ్‌ఖాన్‌, విశ్రాంత హెచ్‌ఎం సుబ్రమణ్యం కలసి బావిలో గల నీటిలో జాతీయ పతాకాలతో ప్రదర్శన చేశారు.

Post Midle

Tags: Independence celebrations in Punganur

Post Midle

Leave A Reply

Your email address will not be published.