శ్రీకాకుళం లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

Independence Day Celebrations in Srikakulam

Independence Day Celebrations in Srikakulam

Date:14/08/2018
శ్రీకాకుళం ముచ్చట్లు:
శ్రీకాకుళం జిల్లాలో రాష్ట్ర స్థాయి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వేడుకల్లో పాల్గొననుండటంతో అధికారులు విస్తృత స్థాయి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ముఖ్యమంత్రి  పర్యటన సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తుతో సమాయత్తమయ్యారు.. రాష్ట్ర స్థాయి పంద్రాగస్టు వేడుకలను పురస్కరించుకొని రాష్ట్ర మంత్రులు సహా అధికార యంత్రాంగం మొత్తం శ్రీకాకుళం జిల్లాకు రానుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఏడాది శ్రీకాకుళంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరపాలని నిర్ణయించటంతో జిల్లా అధికార యంత్రాంగం అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు.. ఈ నేపథ్యంలో ఎటువంటి అసాఅంగీక శక్తులు ప్రవేశించకుండా పటిష్ట పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆర్ట్స్ కళాశాల మైదానంలో పంద్రాగస్టు ఉత్సవాలు జరగనుండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తిచేస్తున్నారు.. ఓ వైపు పనులు చక చకా పూర్తిచేయాలని అధికారులు ఉరకలు పెడుతుంటే మరోవైపు వర్షం అడ్డంకిగా నిలుస్తోంది.
అయినప్పటికీ గడువు దగ్గర పడటంతో అధికారులు రేయింపవళ్ళు శ్రమిస్తున్నారు.. ముఖ్యమంత్రి సహా మంత్రులు , ముఖ్య కార్యదర్శులు , రాష్ట్ర యంత్రాంగం హాజరుకానున్న నేపథ్యంలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీసులు జల్లెడ పడుతున్నారు..మరోవైపు ఈ వేడుకల్లో నిర్వహించబోయే పలు సాంస్కృతిక కార్యక్రమాలు , పరేడ్ , శకటాల ప్రదర్శనలకు సంబంధించి ముందస్తుగా మైదానంలో ముందస్తు ప్రదర్శనలు చేపట్టారు.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు సోమవారం నుండే కొనసాగుతున్నట్టు జిల్లా ఎస్పీ త్రివిక్రమ వర్మ మీడియాకు తెలిపారు.
సోమవారం నుంచి ఈ నెల 15వ తేదీ సాయంత్రం వరకు నగరంలోకి ఎటువంటి భారీ వాహనాలు, అనుమతి లేని వాహనాలు, అనుమతి లేని ఆటోలను అనుమతించమన్నారు.. అదేవిధంగా వాహనాల దారిమళ్లింపు, పార్కింగ్ సంబందించిన ఆంక్షలు ఉన్నందున ప్రజలు సహకరించాలని కోరారు.. వేడుకలకు హాజరయ్యేవారంతా ఆర్ట్స్ కళాశాల మైదానానికి 15 వ తేదీన ఉదయం 8 గంటలకే చేరుకోవాలని తెలిపారు.
Tags:Independence Day Celebrations in Srikakulam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *