Natyam ad

మహనీయుల త్యాగ ఫలమే స్వాతంత్ర్య దినోత్సవం- సర్పంచ్ శ్రీనివాసులురెడ్డి

రామసముద్రం ముచ్చట్లు:

మహనీయులు త్యాగ ఫలమే నేడు దేశ వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారని కెసిపల్లి సర్పంచ్ దిగువపల్లి శ్రీనివాసులురెడ్డి అన్నారు. మంగళవారం కెసిపల్లె సచివాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఇందులో భాగంగా జాతిపిత మహాత్మాగాంధీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం పరపీడన నుండి తప్పించి స్వాతంత్ర్య భారతవని సాధించిన స్వాతంత్ర్య వీరులను ఎప్పటికీ స్మరించుకుందామన్నారు. స్వాతంత్ర్యం వెనుక ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగం, సుదీర్ఘ పోరాటం ,బలిదానాలు ఉన్నాయని గుర్తు చేస్తూ మన దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన సమరయోధులను మనం ఎప్పుడూ గౌరవించుకోవాలన్నారు. భారత దేశ పౌరులుగా ఈ రోజున వీరందరినీ స్మరించుకోవడంమే కాక వారు తెచ్చిపెట్టిన ఈ స్వేచ్ఛ స్వాతంత్య్రాలను కాపాడుకోవడం కూడా మన అందరి బాధ్యత అని అన్నారు. భారతదేశ పౌరులుగా దేశ అభివృద్ధికి,సమైక్యతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.ఈ 77 సంవత్సరాల స్వాతంత్ర్య చరిత్రలో భారత్ ప్రప్రంచంలోనే అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఎదిగిందన్నారు.

 

 

Post Midle

రాష్ట్రంలో జాతిపిత మహాత్మాగాంధీ స్పూర్తితో ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి గ్రామ సచివాలయాలను ఏర్పాటుచేసి ప్రజల ముంగిటకే పరిపాలన వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారన్నారు.తామున్న గ్రామాల్లోనే వైధ్య సేవలు పొందేలా గ్రామ ప్రజలకు దేశంలోనే విలేజ్ హెల్త్ క్లీనిక్లును జగనన్న ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.  మన దేశానికి స్వాతంత్య్రం సాధించడం కోసం ఎంతో మంది ప్రాణాలు అర్పించడంతో నేడు మనం స్వేచ్ఛగా అన్ని హక్కులు అనుభవిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ మహనీయులను ఆదర్శంగా తీసుకుని వారి అడుగుజాడల్లో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, స్థానిక నాయకులు బాబు, ఎల్లారెడ్డి, జయచంద్ర, సచివాలయ సిబ్బంది భారతమ్మ, బత్తెమ్మ, గౌతమి, ఉపేంద్ర, వాలింటర్లు మేఘన, రెడ్డెమ్మ, శ్రావణి, పుష్పావతి, దినకర్, హరీష్, రామచంద్ర, గృహ సారదులు సుమతి, మునస్వామి తదితరులు పాల్గొన్నారు.

Tags; Independence Day is the fruit of the sacrifice of the nobles – Sarpanch Srinivasulu Reddy

Post Midle