అమరావతీ ముచ్చట్లు:
13,326 గ్రామ పంచాయితీలలో ఘనంగా, గౌరవంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరగాలి! వేడుకలు జరపడానికి ఎప్పుడూ లేనంతగా భారీగా నిధులు కేటాయించడం జరిగింది. ప్రతి ఒక్క సర్పంచు వేడుకల్లో పాల్గొనాలి. పాఠశాలల్లో క్విజ్, వ్యాసరచన, డిబేట్, క్రీడా పోటీలు నిర్వహించాలి. స్వాతంత్ర సమరయోధులకు, రక్షణ రంగంలో పని చేసిన వారికి, ముఖ్యంగా పారిశుధ్య కార్మికులకు సత్కారాలు చేయాలి. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ జెండాలు కాకుండా, చేనేత జెండాలు, ప్రకృతికి హాని కలిగించని వస్తువులతో తయారు చేసిన జెండాలతో వేడుకలు జరుపుకోవాలి.గాంధీ మహాత్ములు కలలు కన్న గ్రామ స్వరాజ్యం సిద్దించాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం. దానికి వివిధ కార్యక్రమాలతో ఆగస్టు 15 రోజునే నాంది పలకబోతున్నాం!
Tags: Independence Day should be celebrated with respect – Deputy Chief Minister Pawan Kalyan