గజ్వేల్ లో ఇండిపెండెంట్ గా పోటీ : గద్దర్

Date:08/11/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
గజ్వేల్ లో ఇండిపెండెంట్ గా ఎన్నికల్లో పోటీ చేస్తానని  ప్రజా గాయకుడు గద్దర్  అన్నారు. గురువారం రాష్ట్ర  ఎన్నికల ప్రధాన అధికారిని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.  ఈనెల15న తెలంగాణలోని పల్లె పల్లెకు వెళ్లాలని నిర్ణయించుకున్నానన్నారు. నాకు రక్షణ కల్పించాలని సీఈఓకు  వినతిపత్రం సమర్పించానన్నారు.
జర్నలిస్టులే నా సైన్యం అని పేర్కొన్నారు. మొదటి దశలో ఎస్టీ నియోజకవర్గ పరిధిలో ఓటు పై చైతన్యం కల్పిస్తామన్నారు. ఓట్ల విప్లవం వర్ధిల్లాలన్నారు. రెండో దశలో ఎస్సి నియోజకవర్గ పరిధిలో, 3 దశలో బిసిలు, 4 దశలో నిరు పేదల దగ్గరకు వెళ్తానని పేర్కొన్నారు. ఫ్యూడలిస్టులు – ఇంపీరియలిస్టులు ఎన్నికల కొట్లాట రెండు వర్గాల మధ్యలోనే ఉంటుందన్నారు. అవినీతి కంటే రాజకీయ అవినీతి చాలా అపాయమన్నారు. ఒక ఓటు రాష్ట్ర రాజకీయ నిర్మాణ రూపమన్నారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరినైనా కలువొచ్చుని,  తప్పు కాదన్నారు.  శాంతి చర్చల కోసం ఎందరినో కలిసామన్నారు. నామీద దేశంలో ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయో తెలియదన్నారు. ఏపీలో తన మీద చాలా కేసులు ఉన్నాయని, కానీ విత్ డ్రా చేస్తున్నారన్నారు. శాంతి చర్చల సమయంలో స్థూపం ఆవిష్కరణ చేయడానికి వెళ్లిన తాను పోలీసుల జీవితం పై పాట పాడిన నాపై కేసు పెట్టారు. నాపై కేసు ఎత్తివేసినట్లు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారన్నారు.
నా శత్రువులు అన్ డిటెక్టడ్ అని పోలీసులు చెబుతున్నారని పేర్కొన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు రక్తం చిందిస్తారో వాళ్లే చిరస్మరణీయంగా ఉంటారన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ లేకుంటే ఎన్నికలు ఎందుకు? రాజ్యాంగం ఎందుకు? అని ప్రశ్నించారు.
Tags; Independent contest in Gajewel: Gaddar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *