భారత్‌లో నిర్భందంతో కూడిన స్వేచ్ఛ

Independent freedom in India

Independent freedom in India

Date:16/07/2018
ముంబై ముచ్చట్లు:
బాలీవుడ్ నటుడు, నజఫ్‌గఢ్ నవాబ్ సైఫ్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘భారత్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే చావడం ఖాయం. ఎవరో ఒకరు చంపేస్తారు’ అని వ్యాఖ్యానించారు. తొలి నెట్‌ఫ్లిక్స్ షో ‘సేక్రెడ్ గేమ్స్’ ఈనెల 6 న స్ట్రీమింగ్ సర్వీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో పోలీస్ అధికారి సర్తాజ్ సింగ్ పాత్రను సైఫ్ పోషించారు. అయితే షో చుట్టూ వివాదాలు నెలకున్నాయి. ముఖ్యంగా రాజకీయ నాయకుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ‘సేక్రెడ్ గేమ్స్’పై వివాదం రాజుకుంటున్న నేపథ్యంలో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సైఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మన కులం కాని వారితో డేటింగ్ చేసినా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో చంపేయడం ఖాయమని సైఫ్ అలీఖాన్ అన్నాడు. ప్రస్తుతం లండన్‌లో ఉన్న ఆయన, ఇతరులతో పోల్చుకుంటే భారత్‌లో నిర్భందంతో కూడిన స్వేచ్ఛ ఉంది.. ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఏమవుతుందో తెలియదు, ఎవరో ఒకరు హతమారుస్తారని అన్నారు. ఈ షోను విమర్శించడం తనను చాలా నిరాశకు గురిచేసిందని, కొందరు దీన్ని ప్రసారం చేయవద్దుంటున్నారని సైఫ్ అన్నాడు. ఇప్పుడీ వ్యాఖ్యలపై సర్వత్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు రాజకీయ నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. సేక్రెడ్ గేమ్స్’పై తొలి నుంచీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మితిమీరిన శృంగారం, హింస, అభ్యంతరకరమైన భాషలో పదప్రయోగం లాంటివి ఇందులో ఉపయోగించారు. ముఖ్యంగా దేశంలోని రాజకీయాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు ఇందులో ఉన్నాయి. ఈ షోలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చూపిన విధానంపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కోర్టుకెక్కింది. రాహుల్ గాంధీ ఇటీవల ఓ ట్వీట్ చేస్తూ తన తండ్రి దేశం కోసం జీవించి, సేవ చేస్తూ ప్రాణాలొదిలారు.. సేక్రెడ్ గేమ్స్ వెబ్ సిరీస్‌ కల్పిత పాత్రలు అభిప్రాయాలను ఎప్పటికీ మార్చలేవు’ అని ఈ షో చిత్రీకరణ బృందంపై విమర్శలు గుప్పించారు. దీనికి ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు కో-డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు.
భారత్‌లో నిర్భందంతో కూడిన స్వేచ్ఛ https://www.telugumuchatlu.com/independent-freedom-in-india/
Tags:Independent freedom in India

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *