రాజ యోగంతో అరోగ్యసమాజం-ఆధ్యాత్మిక శక్తికేంద్రము గా భారత్

బ్రహ్మకుమారీస్, విజేఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా యోగ డే వేడుకలు

డాబాగార్డెన్స్ ముచ్చట్లు:

 

 

ప్రపంచ దేశాల్లో ఆధ్యాత్మిక శక్తి కేంద్రంగా భారత్ విరాజిల్లుతుందనీ విఎంఆర్ డి ఏ  చైర్ పర్సన్ అక్కరమాని విజయనిర్మల అన్నారు.. ప్రజాపిత బ్రహ్మకుమారిస్  ఈశ్వరీయ విశ్వవిద్యాలయం,
వైజాగ్ జర్నలిస్టుల ఫోరం సంయుక్తంగా సోమవారం అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.. ఇక్కడ డాబాగార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో వీఎంఆర్డీఏ చైర్పర్సన్ అక్కరమాని విజయనిర్మల ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు,,, దైనందిన కార్యక్రమాల్లో యోగాను  ఎంచుకుంటే వారికి సంపూర్ణ ఆరోగ్యం లభించడం ఖాయమన్నారు,, వివిధ ఆసనాల ద్వారా ఎంతో ఆరోగ్యం చేకూరుతుంది అన్నారు.. క్రమం తప్పకుండా యోగా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్న బ్రహ్మకుమారిస్ ను, వైజాగ్ జర్నలిస్ట్ ఫోరంను  విజయ నిర్మల  అభినందించారు.. కార్యక్రమ నిర్వాహకులు బీకే రామేశ్వరి మాట్లాడుతూ ఎంతో మంది మహర్షులు, రుషులు, మునులు ద్వారా ఈఆసనాలు రూపొందించబడ్డాయి అన్నారు.
మానసిక, శారీరక సమస్యలు పరిష్కారానికి యోగా ఎంతగానో ఉపకరిస్తుంది అన్నారు.. నిత్య జీవితంలో నీరు , నిద్ర ఎంత అవసరమో యోగా కూడా అంతే ముఖ్యం అన్నారు.. సహజ రాజయోగం ద్వారానే ఆరోగ్యకరమైన సమాజం నెలకొంటుంది అన్నారు.. సభాధ్యక్షులు వైజాగ్ జర్నలిస్టు ల ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ ప్రతియేటా  బ్రహ్మకుమారిస్ తో కలిసి యోగా దినోత్సవం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.. క్రమశిక్షణతో కూడిన జీవన విధానం అలవరచుకుంటే ఆరోగ్యకరమైన సమాజం తో పాటు మానసిక సమస్యల పరిష్కారానికి మార్గము సుగమం అవుతుంది అన్నారు.. ఫోరమ్ ఉపాధ్యక్షులు ఆర్ నాగరాజు పట్నాయక్ మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా డే ను   నిర్వహించడం అందులో అనేక మంది జర్నలిస్టులు భాగస్వామ్యం కావడము వల్ల ఎంతో ఉపయోగ పడుతుంది అన్నారు.. అన్ని వయస్సుల వారికి యోగా ఉపకరిస్తుందని చెప్పారు.. కార్య క్రమంలో తొలుత సుబ్బారావు తదితరులు  ప్రాణాయామం. ఆసనాలు వేసి చూపారు.
. వి జే ఎఫ్ కార్యవర్గ సభ్యులు ఇరోతు ఈశ్వర రావు,సనపల మాధవరావు.. బ్రహ్మా కుమరీస్ ప్రతినిది శివ లీల, రూప, బీజేపీ మహిళా నేత ఎస్ వి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.. తొలుత రమ అక్క బృందం అందరికి ప్రసాదాలు అందజేశారు..

 

Post Midle

Tags: India as a health society-spiritual powerhouse with Raja Yoga

Post Midle
Natyam ad