CM PA dies in Tamil with Corona

భార‌త్‌: 6 ల‌క్షలు‌ దాటిన క‌రోనా కేసులు!

-దేశ‌వ్యాప్తంగా 24గంటల్లో 19,148 కేసులు, 434మ‌ర‌ణాలు

-మ‌హారాష్ట్రలో 8వేలు దాటిన మ‌ర‌ణాలు

Date:02/07/2020

దిల్లీ ముచ్చట్లు:

భార‌త్‌లో క‌రోనా వైర‌స్ ఉద్ధృతి రోజురోజుకు పెరుగుతోంది. కొన్నిరోజులుగా నిత్యం 19వేల పాజిటివ్ కేసులు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. గ‌డ‌చిన 24గంట‌ల్లో దేశ‌వ్యాప్తంగా మరో 19,148 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. వీటితో దేశంలో మొత్తం కొవిడ్‌-19 బాధితుల సంఖ్య 6,04,641కి చేరింది. అంతేకాకుండా, నిన్న ఒక్క‌రోజే 434మంది క‌రోనాతో మృతిచెందారు. దీంతో దేశంలో క‌రోనా బారిన‌ప‌డి మృత్యువాత‌ప‌డిన వారిసంఖ్య 17,834కు చేరిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమశాఖ వెల్ల‌డించింది. ఇక దేశంలో క‌రోనా సోకిన మొత్తం బాధితుల్లో ఇప్ప‌టివ‌ర‌కు 3,59,860మంది కోలుకోగా మ‌రో 2,26,947మంది ఆసుప‌త్రుల్లో చికిత్స పొందుతున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

 

18రోజుల్లో రెట్టింపు కేసులు, మ‌ర‌ణాలు..

దేశంలో రోజురోజుకు పెరుగుతున్న‌ వైర‌స్ విజృంభ‌ణ‌తో బాధితుల సంఖ్య 18రోజుల్లోనే రెట్టింపు అవుతోంది. జూన్ 13వ తేదీన దేశంలో క‌రోనా కేసుల సంఖ్య 3,08,993గా ఉండ‌గా, జులై 2నాటికి ఆ సంఖ్య దాదాపు రెట్టింపు అయ్యింది. ఇక మ‌ర‌ణాల సంఖ్య అదే స్థాయిలో పెరుగుతోంది. జూన్ 13నాటికి 8884మ‌ర‌ణాలు సంభ‌వించ‌గా ప్ర‌స్తుతం అవి 17,834కు చేరాయి. అయితే, దేశంలో వైర‌స్ బారిన‌ప‌డి కోలుకుంటున్న వారిశాతం క్ర‌మంగా పెరుగుతుండ‌టం ఊర‌ట క‌లిగించే విష‌యం. ప్ర‌స్తుతం భార‌త్‌లో కొవిడ్ కేసుల రిక‌వ‌రీ రేటు దాదాపు 60శాతంగా ఉంది. మ‌ర‌ణాల రేటు 2.6శాతంగా ఉంది. గ‌త నెల‌తో పోలిస్తే క‌రోనా మ‌ర‌ణాల రేటు తగ్గుతూ వ‌స్తోంది.

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న తమ్మినేని సీతారాం

Tags: India: Corona cases exceeding Rs 6 lakh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *