రోనా టీకాల పంపిణీలో  మరో మైలురాయిని దాటిన భారత్‌

న్యూఢిల్లీ  ముచ్చట్లు:
కరోనా టీకాల పంపిణీలో భారత్‌ మరో మైలురాయిని దాటింది. ఇప్పటి వరకు 34కోట్లకుపైగా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. శనివారం ఉదయం 7 గంటల వరకు అందిన తాతాల్కిక సమాచారం మేరకు దేశంలో 34,46,11,291 వ్యాక్సిన్ డోసులను 45,60,088 సెషన్లలో అందజేసినట్లు చెప్పింది. గడిచిన 24 గంటల్లో 43,99,298 టీకాలు పంపిణీ చేసినట్లు చెప్పింది. హెల్త్‌కేర్‌ వర్కర్లకు 1,02,22,008 మందికి మొదటి.. మరో 72,87,445 మందికి రెండో డోసు వేసినట్లు తెలిపింది.ఫ్రంట్‌లైన్‌ వర్కర్లలో 1,75,60,592 మందికి తొలి, 1,75,60,592 మందికి రెండో మోతాదు అందజేసినట్లు తెలిపింది. 18-44 సంవత్సరాల వయసున్న వారిలో 9,64,91,993 మంది లబ్ధిదారులకు ఫస్ట్‌, మరో 23,80,048 మందికి సెకండ్‌ వేసినట్లు అందించినట్లు పేర్కొంది.45-59 ఏజ్‌గ్రూప్‌లో 8,98,65,131 మందికి మొదటి, మరో 1,75,25,281 మందికి రెండో మోతాదు.. 60 ఏళ్లు పైబడిన వ్యక్తుల్లో 6,86,03,725 మొదటి, మరో 2,50,85,449 మంది లబ్ధిదారులకు రెండో మోతాదు వేసినట్లు వివరించింది.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags:India has crossed another milestone in the distribution of Rona vaccines

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *