భారత్ కు ప్రపంచ గుర్తింపు వచ్చింది

Date:20/06/2019

న్యూఢిల్లీ ముచ్చట్లు:

ప్ర‌పంచ‌వ్యాప్తంగా భార‌త్‌కు ప్ర‌త్యేక గుర్తింపు వ‌చ్చింద‌ని రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. విదేశాల‌తో మ‌న సంబంధాలు మ‌రింత బ‌ల‌ప‌డ్డాయ‌న్నారు. ఈ నేప‌థ్యంలోనే 2022లో భార‌త్ జీ20 స‌ద‌స్సును నిర్వ‌హించ‌నున్న‌ట్లు రామ్‌నాథ్ చెప్పారు. ఇవాళ పార్ల‌మెంట్‌లో ఉభ‌య‌స‌భ‌ల‌ను ఉద్దేశించి ఆయ‌న మాట్లాడారు. ఉగ్ర‌వాదం అంశంలో ప్ర‌పంచ దేశాలు అన్నీ భార‌త్‌కు అండ‌గా ఉన్నాయ‌న్నారు. పాక్‌లో ఉన్న మ‌సూద్ అజ‌ర్‌ను ఐక్యరాజ్య‌స‌మితి అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాదిగా గుర్తించింద‌న్నారు. విదేశాల్లో సెటిల్ అయిన భార‌తీయుల ర‌క్ష‌ణ కోసం ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌న్నారు. విదేశాల్లో ఇబ్బందిప‌డుతున్న వారిని శ‌ర‌వేగంగా ఆదుకుంటున్నార‌న్నారు. పాస్‌పోర్ట్‌, వీసా స‌ర్వీసుల‌ను వేగ‌వంతం చేశామ‌న్నారు. అక్ర‌మంగా భార‌త్‌లోకి చొర‌బ‌డుతున్న విదేశీయులతో అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌ ముప్పుగా మారింద‌న్నారు. నేష‌న‌ల్ రిజిస్ట‌ర్ ఆఫ్ సిటిజ‌న్స్ విధానాన్ని ప్రాధాన్య‌తా అవ‌స‌రాన్ని బ‌ట్టి నిర్వ‌హించ‌నున్న‌ట్లు చెప్పారుపీఎం కిసాన్ స‌మ్మాన్ నిధి ప‌థ‌కాన్ని రైతులంద‌రికీ విస్త‌రించిన‌ట్లు ఇవాళ రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ తెలిపారు.. రైతుల కోసం కేంద్ర ప్ర‌భుత్వం కొత్త స్కీమ్‌ను ప్ర‌వేశ‌పెట్టింద‌ని, అది వారి ఆదాయాన్ని పెంచుతుంద‌న్నారు. ఇది ప్ర‌భుత్వం సాధించిన గొప్ప అంశ‌మ‌న్నారు. రైతుల‌కు పెన్ష‌న్ కూడా ఇస్తోంద‌న్నారు.

 

 

 

 

 

నేష‌న‌ల్ డిఫెన్స్ ఫండ్ నుంచి సైనికుల పిల్ల‌ల‌కు స్కాల‌ర్‌షిప్ అందుతోంద‌న్నారు. 2022లో భార‌త్ 75వ స్వాతంత్ర వేడుక‌లు నిర్వ‌హించ‌నున్న‌ద‌ని, ఇది గ‌ర్వ‌కార‌ణ‌మైన విష‌యం అన్నారు. భ‌విష్య‌త్తు త‌రాల కోసం నీటిని నిలువ చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, దీని కోసం జ‌ల శ‌క్తి మంత్రిత్వ‌శాఖ‌ను ఏర్పాటు చేశార‌న్నారు. కోఆప‌రేటివ్ ఫెడ‌ర‌లిజాన్ని బ‌లోపేతం చేసేందుకు గ‌త వారం కేంద్ర స‌ర్కార్ ముఖ్య‌మంత్రుల‌ను క‌లిసింద‌న్నారు. ప్ర‌ధాన‌మంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి ద్వారా సుమారు 12 వేల కోట్ల రూపాయాల‌ను రైతుల‌కు గ‌త మూడు నెల‌ల్లో పంపిణీ చేశార‌న్నారు. మ‌త్స్య‌శాఖ‌లోనూ బ్లూ రెవ‌ల్యూష‌న్ ప్రారంభించిన‌ట్లు చెప్పారు. మ‌త్స్య సంప‌ద పెంపుద‌ల కోసం భారీ మొత్తం నిధులు కేటాయించిన‌ట్లు తెలిపారు.దేశంలోని ప్ర‌తి మ‌హిళ‌కు, ప్ర‌తి కూతురుకు స‌మాన హ‌క్కు క‌ల్పించేందుకు, ట్రిపుల్ త‌లాక్‌.. నిఖా హ‌లాల్ లాంటి ఆచారాల‌ను నిర్మూలించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని రాష్ట్ర‌ప‌తి అన్నారు. మ‌హిళ‌లు గౌర‌వంగా బ్ర‌తికేందుకు కావాల్సిన అన్ని చ‌ర్య‌లు ప్ర‌భుత్వం తీసుకుంటోంద‌న్నారు.

 

 

 

 

 

 

 

ప్ర‌ధాన‌మంత్రి ముద్రా యోజ‌న కింద సుమారు 19 కోట్ల రుణాల‌ను అంద‌జేసిన‌ట్లు చెప్పారు. ఈ స్కీమ్‌ను 30 కోట్ల మందికి విస్త‌రిస్తున్న‌ట్లు రాష్ట్ర‌ప‌తి తెలిపారు. అవినీతి ప‌ట్ల ప్ర‌భుత్వం క‌ఠినంగా ఉంద‌న్నారు. న‌ల్ల‌ధ‌నానికి వ్య‌తిరేకంగా ప్ర‌భుత్వం పోరాటం చేస్తూనే ఉంటుంద‌న్నారు. మిష‌న్ శ‌క్తితో భార‌త అంత‌రిక్ష టెక్నాల‌జీ సామ‌ర్థ్యం పెరిగింద‌న్నారు.

 

విమాన శకలాలు లభ్యం

Tags: India has got global recognition

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *