భారత్ లోవాట్సాప్‌ చెల్లింపు సేవల పరిశీలనకు ఓ వ్యవస్థ ఏర్పాటు

Date:09/10/2018
న్యూఢిల్లీ  ముచ్చట్లు:
 ప్రముఖ సోషల్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ భారతదేశంలో చెల్లింపు సేవలను పరిశీలించేందుకు ఓ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు వాట్సాప్‌ సంస్థ ప్రకటించింది. రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) రెగ్యులేషన్స్‌ మేరకు వాట్సాప్‌ చెల్లింపుల డేటాను భద్రపరిచేందుకు భారత్‌లోనే కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపింది. అక్టోబరు 15లోగా దీన్ని ఏర్పాటు చేయాలని నోటీసుల్లో పేర్కొంది.
ఇందులో భాగంగా వాట్సాప్‌ భారత్‌లో చెల్లింపులకు సంబంధించిన వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.‘ప్రయోగాత్మక దశలో భాగంగా భారత్‌లో దాదాపు 10లక్షల మంది వాట్సాప్‌ ద్వారా చెల్లింపు సేవలను ఉపయోగించుకుంటున్నారు. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం వాట్సాప్‌ ద్వారా చెల్లింపులు చేస్తున్న వారి డేటాను మొత్తం భారత్‌లోనే నిల్వచేసే విధంగా ఓ వ్యవస్థను రూపొందించాం’ అని వాట్సాప్‌ ప్రతినిధి వెల్లడించారు. వాట్సాప్‌ ఆధారిత చెల్లింపులను భారత్‌ మొత్తం విస్తరింపజేసేందుకు కంపెనీ ప్రయత్నిస్తోందని ఆయన పేర్కొన్నారు.
భారత్‌కు సంబంధించిన డిజిటల్‌ పేమెంట్లు, వినియోగదారుల వివరాలు థర్డ్‌ పార్టీ దగ్గర కాకుండా భారతీయ సర్వర్లలోనే నిక్షిప్తం చేయాలని ఆర్‌బీఐ నోటీసులు పంపించింది. అందులో ఎండ్‌ టు ఎండ్ లావాదేవీల‌ వివరాలు, ఎవరికి నగదు వెళ్లింది? అందుకు సంబంధించిన సందేశం, చెల్లింపు సూచనలను అన్నింటిని భారత్‌లోని సర్వర్లలో పొందుపరచాల్సిందిగా ఆర్‌బీఐ వాట్సాప్‌కు సూచించింది. వాట్సాప్‌ చెల్లింపులకు సంబంధించిన మొత్తం సమాచారం భారత్‌లోని వ్యవస్థలోనే ఉండాలని ఏప్రిల్‌ 6న ఆర్‌బీఐ వాట్సాప్‌కు నోటీసులు పంపించిన విషయం తెలిసిందే.
Tags: India has set up a system for lobbying payments services

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *