భారతదేశం పెప్పర్‌ సంస్థకు రెండవ పుట్టినిల్లు – సీఈవో ఆండ్రియస్‌ హేగర్‌ 

-సీఎం జగన్‌ సహకారం మరువలేనిది

-యువతకు ఉపాధి కల్పిస్తాం

 

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

భారతదేశం పెప్పర్‌ ఎలక్ట్రికల్‌ బస్సుల  సంస్థకు రెండవ పుట్టినిల్లుగా మారిందని , జర్మనీకి చెందిన తమకు  రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అందించిన సహకారం మరువలేనిదని , పుంగనూరులో కంపెనీ ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పిస్తామని కంపెనీ సీఈవో ఆండ్రియస్‌ హేగర్‌  తెలిపారు. శుక్రవారం రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిల సొంత నియోజకవర్గమైన పుంగనూరు మండలంలోని ఆరడిగుంటలో కంపెనీకి కేటాయించిన భూమిని  జిల్లా కలెక్టర్‌ షన్మోహన్‌తో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా పలు విషయాలపై కలెక్టర్‌తో ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, పికెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌తో చర్చించారు. ఈ సందర్భంగా పుంగనూరులో విలేకరుల సమావేశం నిర్వహించారు. సీఈవో మాట్లాడుతూ 2009లో తొలిసారిగా ఇండియాను సందర్శించామన్నారు. భారతదేశంలో అధిక జనాభా ఉన్నారని, అధిక శాతం వాహనాలను వినియోగిస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగా ఇక్కడ 800 ఎకరాలలో రూ. 4640 కోట్ల రూపాయలతో ప్రస్తుతం కంపెనీ ఏర్పాటు చేపడుతామన్నారు. 8100 మందికి ఉపాధి కల్పిస్తామన్నారు. ఫిబ్రవరిలో పనులు ప్రారంభించి, 2027 నాటికి 30 వేల బస్సులు, ట్రక్కులను బహిరంగ మార్కెట్‌లో విడుదల చేస్తామన్నారు. మూడు దశాలలో నిర్మాణ పనులు చేపడుతామన్నారు. పర్యావరణానికి పూర్తి అనుకూలమైన ఎలక్ట్రికల్‌ బస్సులు, ట్రక్కులు , విడిభాగాల తయారీ పరిశ్రమ కూడ ఇక్కడే ఏర్పాటు చేస్తామన్నారు. బెంగళూరు, తమిళనాడుకు పుంగనూరు జాతీయ రహదారులు అనుసంధానం కావడం, విమానాశ్రయాలు, రవాణా సదుపాయాలు ఎంతో బాగుండటంతో పుంగనూరులో పరిశ్రమ పెట్టాలని నిర్ణయించామన్నారు. దీని ద్వారా అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారాలు కొనసాగించేందుకు వీలుందని సీఈవో తెలిపారు. మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిధున్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ షన్మోహన్‌ అందిస్తున్న సహకారం మరువలేనిదని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో  సీటీవో డాక్టర్‌ మదియాస్‌ కెర్లర్‌, సీఎస్‌వో సత్య, ఫైనాన్స్ డైరెక్టర్‌ ఉవేస్టెల్డర్‌, నాఉర్థ్ఎలక్ట్రిక్‌ ఎండి హర్ష ఆధ్యా, పెప్పర్‌ సీఈవో రాజశేఖర్‌రెడ్డి, సీఎస్‌వో సత్యబులుసు, సీసీవో రవిశంకర్‌, ఆర్డీవో మనోజ్‌రెడ్డి, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, పికెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, సీమ జిల్లాల మైనార్టీ సెల్‌ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం తదతరులు పాల్గొన్నారు.

 

సువర్ణ అక్షరాలతో లిక్కించాలి…

 

 

 

పడమటి నియోజకవర్గమైన పుంగనూరు మండలంలో ప్రపంచ ప్రసిద్దిగాంచిన జర్మన్‌ పెప్పర్‌ ఎల్‌క్ట్రికల్‌ బస్సుల కంపెనీ ఏర్పాటు కావడం జిల్లా చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిక్కించదగ్గ రోజు అని జిల్లా కలెక్టర్‌ షన్మోహన్‌ కొనియాడారు. కంపెనీ ప్రతినిధులతో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిల చొరవతో పరిశ్రమ ఏర్పాటౌతోందన్నారు. నిరుద్యోగులు ఉపాధి కోసం వలసలు వెళ్లకుండ ఇక్కడే సుమారు 8000 వేల మందికి ఉపాధి లభిస్తుందని కలెక్టర్‌ స్పష్టం చేశారు. స్థానిక ప్రజలు , ప్రజాప్రతినిధులు పూర్తి సహకారం అందించి , కంపెనీ త్వరిత గతిన పూర్తి చేసేందుకు కృషి చేయాలన్నారు.

 

ఘన స్వాగతం…

 

జర్మన్‌ పెప్పర్‌ కంపెనీ సీఈవో ఆండ్రియస్‌ హేగర్‌ తో కలసిన బృంద సభ్యులకు కర్నాటక సరిహద్దులో పుంగనూరు ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, పికెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, పార్టీ మండల అధ్యక్షుడు కొత్తపల్లె చెంగారెడ్డి లు ఘన స్వాగతం పలికారు. శ్యాలువలు కప్పి సన్మానించారు. డిఎస్పీ సుధాకర్‌రెడ్డి, సీఐ రాఘవరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు నిర్వహించారు.

  

Tags: India is Pepper’s second home – CEO Andreas Hager

 

Post Midle