శరవేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్

Date:09/01/2019
న్యూఢిల్లీ ముచ్చట్లు:
ప్రపంచంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్, 2019-20లోనూ తన స్థానాన్ని నిలుపుకోనుందని వరల్డ్ బ్యాంక్ అంచనా వేసింది. 2017-18లో నమోదైన వృద్ధి రేటు 6.7 శాతం కాగా, అది ఈ ఆర్థిక సంవత్సరం 7.3 శాతానికి చేరవచ్చని అంచనా వేసిన ప్రపంచ బ్యాంక్, వచ్చే సంవత్సరం 7.5 శాతం వృద్ధి రేటు నమోదు కావచ్చని పేర్కొంది. గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్టస్ (జీఈపీ)ని విడుదల చేసిన వరల్డ్ బ్యాంక్, మరికొన్ని సంవత్సరాల పాటు ఇండియా ఇదే విధమైన వృద్ధి రేటును కొనసాగిస్తుందని తెలిపింది.ఇదే సమయంలో దక్షిణాసియాలో పలు దేశాల్లో ఎన్నికలు జరగనున్నాయని గుర్తు చేసిన వరల్డ్ బ్యాంక్, రాజకీయ అనిశ్చితి ఏర్పడవచ్చని తెలిపింది. ఈ కారణంతో వృద్ధి రేటు మందగించే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ఎస్‌టీ, నోట్ల రద్దు కారణంగా 2017 భారత ఆర్థిక వ్యవస్థ ఒడుదొడుకులకు గురై వృద్ధిరేటు 6.7శాతానికి పరిమితమైనట్లు ప్రపంచ బ్యాంకు పేర్కొంది.
దేశీయ వృద్ధిలో గతేడాది భారత్‌ కంటే చైనా ముందుందని, అయితే ఈ ఏడాది మాత్రం ఆ దేశ వృద్ధిరేటు మందగిస్తుందని అంచనా వేసింది. 2018లో చైనా వృద్దిరేటు 6.5శాతానికే పరిమితమవుతుందని, 2021 నాటికి అది 6శాతానికి పడిపోయే అవకాశాలున్నాయని ప్రపంచ బ్యాంక్‌ తమ అంచనాల్లో పేర్కొంది.‘వినియోగంలో పెరుగుదల, పెట్టుబడులతో భారత్‌ వేగంగా వృద్ధి చెందుతోంది. 2018-19 ఆర్థిక వ్యవస్థలో ఆ దేశ వృద్ధిరేటు 7.3శాతంగా ఉంటుందని మేం అంచనా వేస్తున్నాం. ఇక 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరాల్లో భారత వృద్దిరేటు 7.5శాతంగా ఉండొచ్చు’ అని ప్రపంచ బ్యాంక్‌ ప్రాస్పెక్ట్స్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ అయాన్‌ ఖోస్‌ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.ప్రపంచవ్యాప్తంగా వృద్ధిరేటు గతేడాది 3శాతంగా ఉంటే..  ఈ ఏడాది 2.9శాతానికి పరిమితమయ్యేలా ఉందని ప్రపంచ బ్యాంక్‌ అభిప్రాయం వ్యక్తం తెలిపింది. ఈ సంవత్సరం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒడుదొడుకులు తప్పేలా లేవని పేర్కొంది.
Tags:India is the fastest growing economy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *