లంచం తీసుకోవడం తో 85వ స్థానం లో భారత్

న్యూ ఢిల్లీ  ముచ్చట్లు:
 
లంచం లేనిదే ప్రభుత్వ కార్యాలయాల్లో పని జరగదని కొందరు అంటుంటారు. లంచం.. ఈ పదం గురించి పిల్లల నుంచి పెద్దల దాకా తెలుసు.  ప్రభుత్వాలు లంచం చట్టవ్యతిరేకం అని చెప్పినా కూడా… కొందరు అవినీతి అధికారుల వల్ల ఆ సమస్య పూర్తిగా పోలేదు. లంచం తీసుకుంటున్న వారు కొందరు ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడుతున్నారు. అయినా కూడా మార్పు రావడం లేదు. అయితే మన దేశంలో అవినీతి కార్యక్రమాల శాతం ఎంతో తెలుసా..? ప్రపంచదేశాల్లో పోలిస్తే లంచం తీసుకోవడంలో భారత్ స్థానం ఎంతో తెలుసుకుంటే…బెర్లిన్ కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత సంస్థ నాన్ ఫ్రాఫిట్ ఆర్గనైజేషన్ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అవినీతి దేశాల జాబితాను ఇటీవల విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా 180 దేశాల్లో జరుగుతున్న అవినీతి కార్యక్రమాల డేటాతో కరెప్షన్ పర్ సెప్షన్ ఇండెక్స్ సర్వేను చేపట్టింది. అయితే ఇందులో భారత్ స్థానం కాస్త మెరుగుపడింది. 2021కి సంబంధిన సమాచారంతో ఈ ర్యాంకులు విడుదల చేసింది. అయితే 2020 కంటే భారత్ స్థానం కాస్త మెరుగుపడినట్లుగా ఈ సంస్థ నివేదికల్లో వెల్లడించింది. 100 పాయింట్లకు గాను 40 స్కోరు సాధించి… మొత్తం 180 దేశాల్లో 85వ స్థానాన్ని దక్కించుకుంది. గతేడాదితో పోల్చితే ఇది కాస్త మెరుగుపడింది. ఇక దాయాది దేశం పాకిస్తాన్ స్థానం దిగజారినట్లు తెలుస్తోంది. 2020లో ఇది వంద పాయింట్లకు గాను 31 సాధించగా… ఈసారి 28కే పరిమితమైంది. ఫలితంగా అప్పుడు 124 స్థానంలో ఉన్న పాక్… 2021లో ఏకంగా 140 స్థానికి దిగజారింది. ఈ ర్యాంక్ పాక్ ప్రభుత్వానికి పెద్ద దెబ్బ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
 
 
అవినీతి లేని దేశంలో డెన్మార్క్ నిలిచింది. 180 దేశాల్లో తొలి స్థానాన్ని సంపాదించుకుంది. అక్కడ లంచం ప్రభుత్వ కార్యకలాపాల్లో అవినీతి అనేది మచ్చుకు కూడా లేదని సంస్థ సేకరించిన డేటాలో ఉందని వెల్లడించింది. అందుకే అత్యంత నిజాయతీ గల దేశంగా ప్రపంచవ్యాప్తంగా మొదటి స్థానాన్ని సొంతం చేసుకున్నట్లు వివరించింది. అనంతరం ఫిన్లాండ్ న్యూజిలాండ్ నార్వే సింగపూర్ దేశాలు తదుపరి స్థానాల్లో నిలిచాయి. కాగా ఈ లిస్టులో దక్షిణ సుడాన్ ఆఖరి స్థానానికి పరిమితమైంది. లంచం అవినీతి కార్యక్రమాలతో ఈ దేశంలో చివరి స్థానంలో నిలిచిందని నివేదిక వెల్లడించింది.ప్రపంచంలోని 180 దేశాల జాబితాలో దక్షిణ సుడాన్ చివరి స్థానానికి పరిమితమైంది. అయితే దీనికంటే ముందు సిరియా సోమాలియా వెనిజులా యెమెన్ దేశాలు నిలిచాయి. ఇక్కడ అవినీతి కార్యకలాపాలు ఎక్కువ జరుగుతున్నట్లుగా  ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ గుర్తించింది. ప్రపంచవ్యాప్తంగా అవినీతి నిరోధక కార్యకలాపాలు జరుగుతున్నప్పటికీ ఎలాంటి మార్పు లేదని పేర్కొంది. కొన్ని దేశాల్లో ప్రజాస్వామ్యం మానవ హక్కులపై దాడులు జరుగుతూనే ఉన్నాయని వెల్లడించింది.బంగ్లాదేశ్ దేశం… 100 స్కోరుకు 26ను సాధించింది. 147 స్థానానికే పరిమితమైంది. అయితే ఆయా దేశాలతో పోల్చితే భారత్ అవినీతి నిరోధకంలో కాస్త మెరుగుపడింది. దీనిపై రాజకీయ విశ్లేషకులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లంచం తగ్గించడంలో దేశం సఫలం అవుతోందని అన్నారు. ఈ దేశాల్లో 80 శాత గత పదేళ్లలో ఎటువంటి వృద్ధి సాధించలేదని సంస్థ వెల్లడించింది. అవినీతిని కట్టడి చేయడంలో ఎలాంటి పురోగతి కనిపించలేదని పేర్కొంది. ఇది ఆందోళన కలిగించే అంశమని అభిప్రాయపడింది.
పుంగనూరులో రిపబ్లిక్‌డే నాడు బిరియాని విక్రయాలు
Tags: India ranks 85th in bribery

Leave A Reply

Your email address will not be published.