వన్డే సిరీస్‌ని ఓటమితో ఆరంభించిన భారత్ జట్టు

Date:12/01/2019
సిడ్నీ ముచ్చట్లు:
ఆస్ట్రేలియాకి సొంతగడ్డపై టెస్టులో ఓటమి రుచిచూపిన భారత్ జట్టు.. వన్డే సిరీస్‌ని మాత్రం ఓటమితో ఆరంభించింది. సిడ్నీ వేదికగా శనివారం జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో ఓపెనర్ రోహిత్ శర్మ (133: 129 బంతుల్లో 10×4, 6×6) శతకం బాదినా.. టీమిండియాకి 34 పరుగుల తేడాతో కంగారూల చేతిలో ఓటమి తప్పలేదు. 289 పరుగుల లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మ‌తో పాటు మహేంద్రసింగ్ ధోని (51: 96 బంతుల్లో 3×4, 1×6) నిలకడగా ఆడినా.. కీలక సమయంలో వికెట్లు చేజార్చుకోవడంతో ఆఖరికి భారత్ 254/9కే పరిమితమైంది. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో రోహిత్ శర్మ సెంచరీ పూర్తి చేశాడు. 110 బంతులు ఆడిన రోహిత్ 4 సిక్స్ లు, 7 ఫోర్ల తో సెంచరీ పూర్తి చేశాడు. 289 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఆదిలోనే కీలక వికెట్లని కోల్పోయింది. ఈ దశలో ధోని, రోహిత్ శర్మ నెమ్మదిగా ఆడుతూ స్కోర్ బోర్డుని ముందుకు నడిపించారు. 51 పరుగులు పూర్తి చేసిన ధోని బెహ్రెన్డెర్ఫ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. మూడు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0తో ఆధిక్యంలో నిలవగా.. రెండో వన్డే అడిలైడ్ వేదికగా మంగళవారం ఉదయం 8.50 నుంచి జరగనుంది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు.. హ్యాండ్స్‌కబ్ (73: 61 బంతుల్లో 6×4, 2×6), ఉస్మాన్ ఖవాజా (59: 81 బంతుల్లో 6×4), షాన్ మార్ష్ (54: 70 బంతుల్లో 4×4) అర్ధశతకాలు బాదడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ (2/66), కుల్దీప్ యాదవ్ (2/54) ఫర్వాలేదనిపించారు. 289 పరుగుల లక్ష్యఛేదనలో భారత్‌కి మెరుగైన ఆరంభం లభించలేదు. ఓపెనర్ శిఖర్ ధావన్ (0), కెప్టెన్ విరాట్ కోహ్లీ (3), అంబటి రాయుడు (0) తొలి నాలుగు ఓవర్లలోపే పెవిలియన్ చేరిపోవడంతో భారత్ 4/3తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత తీసుకున్న రోహిత్ శర్మ – మహేంద్రసింగ్ ధోని జోడీ.. నాలుగో వికెట్‌కి అభేద్యంగా 137 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.
ఈ క్రమంలో ఇద్దరూ అర్ధశతకాలు పూర్తి చేసుకోవడంతో భారత్ ఒకానొక దశలో 140/3తో మెరుగైన స్థితిలో నిలిచింది. కానీ.. జట్టు స్కోరు 141 వద్ద ధోనీ ఔటవగా.. అనంతరం వచ్చిన దినేశ్ కార్తీక్ (12), రవీంద్ర జడేజా (8) నిరాశపరిచారు. అయినప్పటికీ.. ఒక ఎండ్‌లో 46వ ఓవర్ వరకూ పోరాడిన రోహిత్ శర్మ.. కెరీర్‌లో 22వ శతకం పూర్తి చేసుకుని జట్టు స్కోరు 221 వద్ద ఔటయ్యాడు. దీంతో.. భారత్ ఓటమి ఖాయమైంది. అయితే.. ఆఖర్లో భువనేశ్వర్ కుమార్ (29 నాటౌట్: 23 బంతుల్లో 4×4) బ్యాట్ ఝళిపించి ఓటమి అంతరాన్ని కాస్త తగ్గించాడు.
Tags:India squad opener

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *