ఆక్లాండ్ టీ20లో ఏడు వికెట్ల తేడాతో నెగ్గిన భారత్

India won by seven wickets in Auckland Tea 20
Date:09/02/2019:
ముంబై ముచ్చట్లు:
ఆక్లాండ్ టీ20లో న్యూజిలాండ్‌పై ఏడు వికెట్ల తేడాతో నెగ్గిన భారత్ 1-1తో సిరీస్ సమం చేసింది. కివీస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేయగా.. మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే టీమిండియా విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో టీ20ల్లో అత్యధిక లక్ష్య చేధనల్లో విజయం సాధించిన జట్టుగా పాకిస్థాన్ రికార్డ్‌ను భారత్ బ్రేక్ చేసింది. 2006లో పొట్టి ఫార్మాట్‌‌లో అడుగుపెట్టిన భారత్ 56 మ్యాచ్‌ల్లో ఛేజింగ్‌కి దిగగా 37సార్లు విజయం సాధించింది. 17 మ్యాచ్‌ల్లో టీమిండియా ఓడింది. ఆక్లాండ్‌ గెలుపుతో టీమిండియా గెలుపోటముల రేషియో 2.176గా ఉంది. 64 మ్యాచ్‌ల్లో 36 విజయాలు సాధించిన పాకిస్థాన్ గెలుపోటముల రేషియో 1.384గా ఉంది. తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక ఉన్నాయి. హమిల్టన్‌లో జరగబోయే మూడో టీ20లోనూ విజయం సాధిస్తే.. పాకిస్థాన్ రికార్డును భారత్ సమం చేస్తుంది. వరుసగా 11 సిరీసులను గెలుపొందిన పాక్‌ను ఇటీవలే దక్షిణాఫ్రికా ఓడించింది. భారత్ గత పది సిరీస్‌ల్లో 8 గెలవగా.. ఆస్ట్రేలియాతో రెండు సిరీస్‌లను డ్రాగా ముగించింది. పొట్టి ఫార్మాట్‌లో భారత్ చివరిగా 2017 జూలైలో విండీస్‌కు సిరీస్ కోల్పోయింది.
Tags:India won by seven wickets in Auckland Tea 20

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *