ఇన్నింగ్స్ 250 పరుగలతో భారత్ విజయం

India won the innings 250 runs

India won the innings 250 runs

Date:06/10/2018
రాజ్ కోట ముచ్చట్లు:
ఈ ఏడాదిలో ఇన్నింగ్స్ 250+ స్కోరు తేడాతో కోహ్లీసేన గెలుపొందడం ఇది రెండోసారి.సుదీర్ఘ టెస్టు క్రికెట్ చరిత్రలో భారత్ జట్టు రికార్డు స్థాయి గెలుపుని శనివారం అందుకుంది. రాజ్‌కోట్ వేదికగా వెస్టిండీస్‌తో ఈరోజు ముగిసిన టెస్టు మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా ఇన్నింగ్స్ 272 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.
టెస్టుల్లో భారత్‌కి ఇదే అతిపెద్ద గెలుపుకాగా.. ఈ ఏడాదిలోనే ఇన్నింగ్స్ 250+ స్కోరు తేడాతో కోహ్లీసేన గెలుపొందడం ఇది రెండోసారి. టెస్టుల్లో ఇన్నింగ్స్ తేడాతో భారత్ జట్టు గెలుపొందిన మ్యాచ్‌లను ఓ సారి పరిశీలిస్తే..! ఈరోజు రాజ్‌కోట్‌లో వెస్టిండీస్‌పై గెలిచిన మ్యాచ్ అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత ఈ ఏడాదే బెంగళూరు వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 262 పరుగుల తేడాతో గెలుపొందిందిన మ్యాచ్ నిలిచింది.
ఇక మూడో స్థానంలో.. 2007లో బంగ్లాదేశ్‌పై ఇన్నింగ్స్ 239 పరుగుల తేడాతో గెలుపొందిన మ్యాచ్ ఉండగా.. నాలుగో స్థానంలో 2017లో నాగ్‌పూర్ వేదికగా శ్రీలంకపై ఇన్నింగ్స్ 239 పరుగుల తేడాతో గెలిచిన మ్యాచ్‌ నిలిచింది. ఐదో స్థానంలో 1998లో ఆస్ట్రేలియాపై కోల్‌కతా వేదికగా ఇన్నింగ్స్‌ 219 పరుగుల తేడాతో గెలిచిన మ్యాచ్ ఉంది.
Tags:India won the innings 250 runs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *