డిసెంబర్ తర్వాతే ఇండియన్ క్రికెట్.. 

Date:15/07/2020

ముంబై ముచ్చట్లు:

ఓవరాల్‌‌గా ఓవర్‌‌సీస్‌‌ క్రికెట్‌‌ బాగానే నడుస్తోంది.మరి ఇండియాలో ఆట రీస్టార్ట్ ఎప్పుడు..? మిడ్‌‌ మార్చి నుంచి ఇళ్లకే పరిమితమైన క్రికెటర్లలో.. షమీ, ఉమేశ్‌‌, పంత్‌‌, పుజారా, విహారి మాత్రమే ఔట్‌‌డోర్‌‌ ప్రాక్టీస్‌‌ మొదలుపెట్టగా.. కోహ్లీ బ్యాట్‌‌, బాల్‌‌ పట్టక చాలా రోజులవుతున్నది డిసెంబర్‌‌లో మొదలయ్యే ఆసీస్‌‌ టూర్‌‌ వరకు ఇంటికే పరిమితమవుతుందా?రోజురోజుకు వరల్డ్‌‌ క్రికెట్‌‌ ఏదో రకంగా ఓపెన్‌‌ అవుతున్నా.. ఇండియన్‌‌ క్రికెట్‌‌ మాత్రం ఇంకా లాక్‌‌డౌన్‌‌లోనే ఉంది. దేశంలో వైరస్‌‌ ఉదృతి తగ్గకపోవడం, స్టేడియాలు ఓపెన్‌‌ చేసేందుకు పర్మిషన్స్‌‌ లేకపోవడంతో నాలుగు నెలల నుంచి క్రికెటర్లు ఇంకా ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. దీంతో హోమ్‌‌ సిరీస్‌‌లతో పాటు ఫారిన్‌‌లో ఆడాల్సిన టోర్నీలు కూడా ప్రశ్నార్థకంగా మిగిలాయి. ఇక ఐపీఎల్‌‌ పరిస్థితి కూడా ఇప్పట్లో తేలేలా లేదు. దీంతో ఈ సీజన్‌‌ ఇండియాలో క్రికెట్‌‌ రీస్టార్ట్‌‌ అవుతుందా? అన్న సందేహాలు మొదలయ్యాయి. ఇదే విషయాన్ని బీసీసీఐ ప్రెసిడెంట్‌‌ సౌరవ్‌‌ గంగూలీ ముందుంచగా.. డిసెంబర్‌‌ వరకు టీమిండియా క్రికెట్‌‌ ఆడే పరిస్థితి లేదని తేల్చాడు. అంటే ఆస్ట్రేలియా టూర్‌‌తోనే ఇండియా టీమ్‌‌ క్రికెట్‌‌ మొదలవుతుందని సంకేతాలిచ్చాడు.

 

ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను బట్టి చూస్తే షెడ్యూల్‌‌లోనూ భారీ మార్పులు తప్పకపోవచ్చు. చాలా రోజులుగా ఆటకు దూరంగా ఉన్న సెంట్రల్‌‌ కాంట్రాక్ట్‌‌ క్రికెటర్ల కోసం మిడ్‌‌ జులైలో నేషనల్‌‌ క్యాంప్‌‌ నిర్వహించాలని బీసీసీఐ చాలా రోజుల కిందటే ప్లాన్‌‌ చేసింది. కానీ వైరస్‌‌ కంట్రోల్‌‌లోకి రాకపోవడం, చాలా ప్రాంతాల్లో లాక్‌‌డౌన్‌‌ కొనసాగుతుండటం, ఎయిర్‌‌ ట్రావెల్‌‌ రిస్ట్రిక్షన్స్‌‌ ఉండటంతో క్యాంప్‌‌ విషయంలో బోర్డు అచేతనంగా మారిపోయింది. సెంట్రల్‌‌, స్టేట్‌‌ గవర్నమెంట్స్‌‌ను అప్రూవల్స్‌‌ రాకుండా ఈ విషయంలో ముందుకెళ్లలేమని బోర్డు వర్గాలు స్పష్టం చేశాయి. అంటే క్యాంప్‌‌ను కూడా వాయిదా వేయడం తప్ప మరో మార్గం లేదు. బెంగళూరులోని ఎన్‌‌సీఏలో క్యాంప్‌‌ పెట్టాలనుకున్నా.. ఇప్పుడున్న పరిస్థితిలో అది అంత సేఫ్‌‌ కాదు. ప్లాన్‌‌–బిలో భాగంగా ధర్మశాలకు వెళ్లినా క్రికెటర్లకు వసతి విషయంలో సమస్యలు ఎదురవుతాయని బోర్డు భావిస్తోంది. ఈ టైమ్‌‌లో క్రికెటర్లందరినీ అక్కడికి తీసుకెళ్లడం సేఫ్‌‌ కాదని క్యాంప్‌‌ను హోల్డ్‌‌లో పెట్టింది. అయితే ఆగస్టు ఫస్ట్‌‌ వీక్‌‌లోపు అన్నీ సర్దుకుంటాయని బోర్డు ఆశిస్తున్నా.. ప్రాక్టికల్‌‌గా ఇది సాధ్యం కాదనే వాదన వినబడుతోంది.  ఒకవేళ అన్నీ అనుకూలించి ఐపీఎల్‌‌ నిర్వహణకు మార్గం సుగమమైతే  ప్లేయర్లంతా టోర్నీకి 21 రోజుల ముందే తమ ఫ్రాంచైజీలకు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. అందువల్ల నేషనల్‌‌ క్యాంప్‌‌ కేవలం ఫార్మాలిటీనే  అవుతుందని మరో వాదన.

 

 గాంధీలో రోబో సేవలు

Tags:Indian cricket after December ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *