Natyam ad

17న “ఇండియన్ స్వచ్ఛత లీగ్” ర్యాలీ- నగర కమిషనర్  హరిత

నెల్లూరు ముచ్చట్లు:

స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా యువతను స్వచ్ఛతవైపు పయనింపజేయు ఉద్దేశ్యంతో భారత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు ఈ నెల 17 వ తేదీన “ఇండియన్ స్వచ్ఛత లీగ్” ర్యాలీని నిర్వహిస్తున్నట్లు నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ హరిత పేర్కొన్నారు. ఈమేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేసారు. స్థానిక బారాషాహీద్ దర్గా ప్రాంగణం నుంచి ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే ర్యాలీలో నెల్లూరు నగర, రూరల్ శాసనసభ్యులు, నగర పాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, నగర పాలక సంస్థ ఇండోర్, ఔట్ డోర్ సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కమిషనర్ ఆకాంక్షించారు. 1 నుంచి 54 డివిజనుల పరిధిలోని సచివాలయం కార్యదర్శులు తమ ప్రాంతాల్లోని యువతను చైతన్య పరిచి ర్యాలీలో పాల్గొనేలా ప్రోత్సాహమివ్వాలని కమిషనర్ సూచించారు.

 

Post Midle

Tags: “Indian Swachhata League” rally on 17- City Commissioner Haritha

Post Midle

Leave A Reply

Your email address will not be published.