భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలు ఒక అద్భుతం

వనపర్తి ముచ్చట్లు:


భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలు ఒక అద్భుతమని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల నేపథ్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలో సామూహిక జాతీయ గీతాలాపన సంధర్భంగా మంత్రి స్వయంగా తయారు చేయించిన తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద 3 వేల అడుగుల పొడవైన జాతీయజెండా ప్రదర్శన .. జాతీయ గీతాలాపనలో అయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి 15 వేల మంది విద్యార్థులు, యువత, ప్రజలు హజరయ్యారు.

 

మంత్రి మాట్లాడుతూ ప్రతి రోజూ విభిన్న కార్యక్రమాలతో స్వాతంత్ర్య ప్రత్యేకతను చాటుకుంటున్నాం. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను అర్పించిన, వెలకట్టలేని త్యాగాలు చేసిన వారిని స్మరించుకుంటున్నాం. వనపర్తిలో 3 వేల అడుగుల జాతీయ పతాకం ప్రదర్శన ఒక ప్రత్యేకత. అంబేద్కర్ చౌరస్తా నుండి కలెక్టరేట్ వరకు 3 కిలోమీటర్లు వేలాది మంది జాతీయ జెండాను చేతులపై ఎత్తుకుని జాతీయ గీతాలాపన చేయడం బహూషా రాష్ట్రంలో మొదటిసారి. అత్యంత వినూత్న, అరుదైన కార్యక్రమానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలని అన్నారు. స్వాతంత్ర్యం విలువ ప్రస్తుత తరాలకు తెలిస్తే భవిష్యత్ తరాలకు అర్దమవుతుంది. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ 2 వారాల పాటు భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ సంబరాలకు రూపకల్పన చేశారని అన్నారు.

 

Tags: India’s Independence Diamond Jubilee is a miracle

Leave A Reply

Your email address will not be published.