భారత్ ఆటగాళ్లకి ఐపీఎల్ 2019 సీజన్ సువర్ణావకాశం

India's IPL season is the golden season of the 2019 season
Date:19/03/2019
ముంబై ముచ్చట్లు:
ప్రపంచకప్‌లో ఆడాలని ఆశించే భారత్ ఆటగాళ్లకి ఐపీఎల్ 2019 సీజన్ సువర్ణావకాశమని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారి ఒకరు తెలిపారు. మార్చి 23 నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రారంభంకానుండగా.. ఈ టోర్నీ ముగిసిన కొద్దిరోజులకే అంటే.. మే 30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే ప్రపంచకప్‌ మొదలవుతుంది. ఇప్పటికే ప్రపంచకప్‌ జట్టుపై స్పష్టత వచ్చిందని కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రకటించినా.. ఇంకా రెండు మూడు స్థానాలపై సెలక్టర్లు కసరత్తులు చేస్తున్నట్లు ఆ అధికారి తాజాగా వెల్లడించాడు. ఆస్ట్రేలియాతో ఇటీవల ఐదు వన్డేల సిరీస్‌ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన కోహ్లీ ఓ స్థానం పై చర్చ జరుగుతోందని వెల్లడించాడు. కానీ.. రెండో వికెట్ కీపర్, ఆల్‌రౌండర్ స్థానాలపై కూడా సెలక్టర్లు ఇప్పటికీ కసరత్తులు చేస్తున్నట్లు బీసీసీఐ అధికారి తెలిపారు. నెం.4 స్థానంలో గత ఏడాదికాలంగా మెరుగ్గా రాణించిన అంబటి రాయుడు.. ఇటీవల ఫామ్ కోల్పోయాడు. ఇక రెండో వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ దాదాపు ఖాయమైన నేపథ్యంలో.. ఆస్ట్రేలియాపై వరుస తప్పిదాలతో మళ్లీ సెలక్టర్లని ప్రశ్నార్థకంలో పడేశాడు. ఇక ఆల్‌రౌండర్‌ రేసులో ఉన్న హార్దిక్ పాండ్య గాయాలతో బాధపడుతుండగా.. విజయ్ శంకర్‌ నిలకడ సాధించలేకపోతున్నాడు. దీంతో.. ఐపీఎల్‌పై దృష్టి సారించి.. అత్యుత్తమంగా ఆడిన ఆటగాళ్లని ప్రపంచకప్ జట్టులోకి ఎంపిక చేయాలని భారత సెలక్టర్లు భావిస్తున్నట్లు ఆ అధికారి తెలిపారు.
నెం.4 బ్యాట్స్‌మెన్ రేసులో.. అంబటి రాయుడు, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అజింక్య రహానె ఉండగా.. రెండో వికెట్ కీపర్ స్థానం కోసం రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్‌ పోటీపడుతున్నారు. ఏప్రిల్ 20 సమయంలో టీమ్‌ను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఐపీఎల్ తొలి నెల కీలకం కానుంది. ఇందులో బాగా రాణించిన వాళ్లకు వరల్డ్‌కప్‌లో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి. నిజానికి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లోనే అన్ని స్థానాలకు ప్లేయర్స్ దొరుకుతారు అని భావించినా.. నాలుగో స్థానంలో మాత్రం మిస్టరీగానే మిగిలిపోయింది. ఆ స్థానంలో ఎవరూ రాణించలేదు. ప్రస్తుతానికి ఈ స్థానం కోసం నలుగురు పోటీ పడుతున్నారు. అజింక్య రహానే, అంబటి రాయుడు, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్.. ఈ స్థానం కోసం పోటీలో ఉన్నారు. వీళ్లు ఐపీఎల్‌లో ఎలా రాణిస్తారన్నదానిని బట్టి వరల్డ్‌కప్ టీమ్ ఎంపిక ఆధారపడి ఉంది. నాలుగో స్థానానికి ఇంకా ఏ ప్లేయర్ ఖరారు కాలేదు. ఈ స్థానం కోసం ఇంకా పోటీ ఉంది. గతేడాది కొంత మంది ప్లేయర్స్ ఈ స్థానంలో కుదురుకుంటారని భావించినా అలా జరగలేదు.
దీంతో తొలి నెల ఐపీఎల్‌లో రాణించిన ప్లేయర్‌కు ఈ స్థానం దక్కే అవకాశం ఉంది అని ఓ బీసీసీఐ అధికారి వెల్లడించారు. టీమ్ మేనేజ్‌మెంట్ వర్గాలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాయి. నిజానికి కోహ్లిని నంబర్ 4లో పంపాలని కోచ్ రవిశాస్త్రి ప్రతిపాదించినా.. అది మ్యాచ్ పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుంది తప్ప అతడు నాలుగో స్థానానికే పరిమితం కాడు అని టీమ్ మేనేజ్‌మెంట్ స్పష్టం చేసింది. రహానే, శ్రేయస్ అయ్యర్ ఇప్పటికీ వరల్డ్‌కప్ టీమ్‌లో తమకు చోటు దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్‌లో రాణిస్తే నంబర్ 4 తమదే అని ఈ ఇద్దరూ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. వరల్డ్‌కప్ టీమ్ గురించి తాను ఆలోచించడం లేదని, అయితే ఐపీఎల్‌లో రాణిస్తే టీమ్‌లో చోటు అదే దక్కుతుందని రహానే అన్నాడు. ఐపీఎల్ మొదట్లోనే రాణిస్తే అది సెలక్టర్లను ప్రభావితం చేస్తుందని అటు శ్రేయస్ అయ్యర్ కూడా అభిప్రాయపడ్డాడు.
Tags:India’s IPL season is the golden season of the 2019 season

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *