ఇండియా మ్యాచ్ కు వర్షం అడ్డంకే

Uppal stadium to the finals will

Uppal stadium to the finals will

Date:12/06/2019

లండన్ ముచ్చట్లు:

ఇంగ్లాండ్‌లో వరల్డ్ కప్ ఏ ముహూర్తాన మొదలైందో కానీ.. వరుణుడు మాత్రం వదలడం లేదు. వర్షం కారణంగా ఇప్పటికే మూడు మ్యాచ్‌లు రద్దయ్యాయి. శ్రీలంక ఆడాల్సిన రెండు మ్యాచ్‌లైతే ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయ్యాయి. మ్యాచ్‌లకు పదే పదే వర్షం ఆటంకం కలిగిస్తుండటంతో వరల్డ్ కప్ కళ తప్పుతోంది. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య నాటింగ్‌హామ్ వేదికగా గురువారం జరగాల్సిన మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. ఈ వారం మొత్తం నాటింగ్‌హామ్‌లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. నాటింగ్‌హమ్‌లో వర్షాలు కురుస్తుండటంతో టీమిండియా ప్రాక్టీస్‌కు చేయడానికి కూడా వీల్లేకుండా పోయింది. వరుసగా రెండు రోజులపాటు టీమిండియా ప్రాక్టీస్‌కు దూరమైంది. బుధవారం రాత్రి వరకు నాటింగ్‌హామ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని.. గురువారం మధ్యాహ్నం వరకు జల్లులు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్షం వల్ల మ్యాచ్ రద్దు కాకపోయినప్పటికీ.. అంతరాయం కలగడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. వరల్డ్ కప్‌లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన న్యూజిలాండ్ ఆరు పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. భారత్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలుపొంది ఉత్సాహం మీదుంది.

 

జూలై 15న చంద్రయాన్

TagsLIndia’s match against rain

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *