రానున్న కాలంలో తగ్గనున్న భారతదేశం జనాభా!

హైదరాబాద్ ముచ్చట్లు:
1950వ సంవత్సరం వరకు స్థిరంగానే ఉన్న ప్రపంచ జనాభా ఒక్కసారిగా పెరగడం మొదలైంది. 1950 నుంచి 1987 మధ్యలో కేవలం 37 ఏళ్లలో ప్రపంచ వ్యాప్తంగా 250 కోట్ల మంది పెరిగారు. చాలా దేశాల్లో ప్రభుత్వాలు జనాభాను కట్టడి చేసేందుకు ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకున్నా… అడ్డదిడ్డంగా పెరుగుతూ పోతున్న జనాభాను కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఇలా జనాభా పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వనరులు కొద్ది మందికి మాత్రమే అందుతున్నాయి. ఈ అధిక జనాభాతో నేడు ప్రపంచం అనేక సమస్యలను ఎదుర్కుంటుంది. జనాభా పెరుగుదలతో అనేక అనర్థాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ముందే గ్రహించిన ఐక్యరాజ్య సమితి జనాభాను నియంత్రించాలని పలు దేశాలను ఆదేశించింది.కాగా ప్రపంచంలోని అనేక దేశాల ప్రజలు జనాభా పెరుగుతుందని ఆందోళన చెందుతుంటే.. విచిత్రంగా కొన్ని దేశాల వారు మాత్రం తమ జనాభా తగ్గిపోతుందంటూ గగ్గోలు పెడుతున్నారు. 2020 వ సంవత్సరంలో జపాన్ దేశంలో 12.7 కోట్ల మంది ఉండగా… ఈ సంఖ్య 2050 వరకు 10.6 కోట్లకు తగ్గనుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అంటే ఏకంగా అక్కడ జనాభాలో ఈ 30 ఏల్ల కాలంలో 16 శాతం తగ్గుదల నమోదు కానుంది.మరో దేశం ఇటలీని తీసుకుంటే ఇక్కడ 2050 వరకు జనాభా 5 కోట్లకు చేరకుంటుందట. ప్రస్తుతం ఇటలీలో 6.1 కోట్ల మంది నివసిస్తున్నారు. ఈ రెండు దేశాలే కాకుండా… గ్రీస్ క్యూబా తదితర దేశాలు సైతం ఇలా జనాభా తగ్గుదలను ఎదుర్కుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ క్రమం లో రానున్న కాలంలో మన దేశంలో జనాభా తగ్గనుందని అంచనాలు వేస్తున్నారు.
ఇందుకు కారణం దేశంలోని ప్రజలకు జనాభా నియంత్రణ మీద పెరిగిన అవగాహనే అని చెబుతున్నారు. ఇండియాలో జనాభా పెరుగుదలను చూసుకుంటే ప్రస్తుతం ఒకరు 2.1 కొత్త పిల్లలకు జన్మనిస్తున్నారు. కానీ కొన్ని రాష్ర్టాలలో మాత్రం ఈ సగటు ఇంకా తక్కువగా ఉండడం గమనార్హం.

 

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags:India’s population to decline in the coming period!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *