Natyam ad

రక్షణ’ తయారీలో భారత్‌ రికార్డు.. తొలిసారి రూ.లక్ష కోట్లు దాటిన ఉత్పత్తి!

దిల్లీ ముచ్చట్లు:

రక్షణ ఉత్పత్తుల తయారీ (Defence Production)లో భారత్‌ రికార్డు సృష్టించింది. తొలిసారిగా 2022- 23 ఆర్థిక సంవత్సరంలో రూ.లక్ష కోట్లకుపైగా విలువైన రక్షణ ఉత్పత్తులను తయారు చేసింది.ప్రస్తుతం ఉత్పత్తుల విలువ రూ.1.06 లక్షల కోట్లుగా ఉండగా.. ఇంకా మరికొన్ని ప్రయివేటు రక్షణ సంస్థల నుంచి డేటా వస్తే మరింత పెరుగుతుందని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. స్వావలంబనే లక్ష్యంగా.. రక్షణ శాఖ (Defence Ministry) స్థిరమైన ప్రయత్నాలతో ఈ రికార్డు సాధ్యమైందని పేర్కొంది.ఇదిలా ఉండగా.. 2022- 23 ఆర్థిక సంవత్సరంలో నమోదైన రక్షణ ఉత్పత్తుల విలువ.. 2021-22లోని రూ.95 వేల కోట్లతో పోలిస్తే 12 శాతానికిపైగా అధికం కావడం విశేషం. రక్షణ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు, వాటికి పరిష్కార మార్గాలను కనుగొనేందుకు తమ శాఖ నిరంతరం పని చేస్తోందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ట్వీట్‌ చేశారు.

 

Post Midle

Tags; India’s record in the manufacture of ‘defense’.. For the first time, the product crossed Rs.1 lakh crore!

Post Midle