గౌరవ ప్రదంగా భారత్ స్కోరు 

India's score of honor

India's score of honor

Date:06/12/2018
సిడ్ని ముచ్చట్లు:
ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా గురువారం ఆరంభమైన తొలి టెస్టు మ్యాచ్‌లో మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా (123: 246 బంతుల్లో 7×4, 2×6) వీరోచిత శతకంతో భారత్ పరువు నిలిపాడు. స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి (3), ఓపెనర్లు మురళీ విజయ్ (11), కేఎల్ రాహుల్ (2), రహానె (13) విఫలమైనా.. రోజంతా పట్టుదలతో క్రీజులో నిలిచిన పుజారా భారత్‌కి తొలిరోజు 250/9తో గౌరవప్రదమైన స్కోరు అందించాడు. ప్రస్తుతం క్రీజులో మహ్మద్ షమీ (6 బ్యాటింగ్: 9 బంతుల్లో 1×4) ఉండగా.. 87.5 ఓవర్ల వద్ద పుజారా రనౌటవడంతో.. ఈరోజు ఆటని అంపైర్లు నిలిపివేశారు. మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే.. ఇటీవల ప్రాక్టీస్ మ్యాచ్‌లో అదరగొట్టిన ఓపెనర్లు తొలి 7 ఓవర్లలోనే పెవిలియన్‌కి చేరిపోగా.. అనంతరం వచ్చిన విరాట్ కోహ్లి కూడా నిరాశపరిచాడు. దీంతో.. అప్పటికే క్రీజులోకి వచ్చిన పుజారా.. రహానెతో కలిసి కాసేపు ఇన్నింగ్స్‌ని నడిపించాడు. కానీ.. రహానె కూడా జట్టు స్కోరు 41 వద్ద పెవిలియన్ చేరిపోయాడు. దీంతో.. 20.2 ఓవర్లలో 41/4తో భారత్ కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన రోహిత్ శర్మ (37: 61 బంతుల్లో 2×4, 3×6) కాసేపు మెరుపులు మెరిపించి.. భారత్ శిబిరంలో ఉత్సాహం నింపాడు. మరో ఎండ్‌లో పుజారా కూడా పరుగుల వేట మొదలెట్టడంతో స్కోరు బోర్డులో కదలిక వచ్చింది. కానీ.. పూర్తిగా వన్డే ఫార్మాట్‌లోకి వెళ్లిపోయిన రోహిత్ శర్మ.. వరుస సిక్సర్ల కోసం ప్రయత్నించి స్పిన్నర్ నాథన్ లయన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అనంతరం వచ్చిన రిషబ్ పంత్ (25: 38 బంతుల్లో 2×4, 1×6) కూడా అదే బాటలో పెవిలియన్ చేరడంతో.. మళ్లీ 127/6తో భారత్‌కి కష్టాలు మొదలయ్యాయి.
Tags:India’s score of honor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *