అక్రమార్కుల పట్ల ఉదాసీనత వ్యవహరించేది లేదు.
-రాజంపేట సబ్ కలెక్టర్ కేతన్ గార్గ్….
రాజంపేట ముచ్చట్లు:
ప్రభుత్వ భూముల అన్యాక్రాంతానికి పాల్పడే నెరస్థులపై ఎలాంటి ఉదాసీనత వ్యవహరించేది లేదని.. రాజంపేట సబ్ కలెక్టర్ కేతన్ గార్గ్ శనివారం ఒక ప్రకటనలో హెచ్చరికలు జారీ చేశారు.
రెవెన్యూ డివిజన్ పరిధిలో.. కొంతమంది నకిలీ డి.ఫారాలు, పట్టాదార్ పాస్‌బుక్‌లు, ఇతర రెవెన్యూ రికార్డులను సృష్టించేందుకు అక్రమంగా చట్ట విరుద్ధమైన చర్యలకు పాల్పడుతున్నట్లు గుర్తించడం జరిగిందన్నారు.
రెవెన్యూ రికార్డుల పరంగా.. నకిలీ పత్రాలను సృష్టించేందుకు పాల్పడే వారిని, లేదా అలాంటి చర్యల్లో పాలుపంచుకుంటున్న వారిని, లేదా నకిలీ పత్రాలను రెవెన్యూ అధికారుల ముందు ఎవరైనా.. సమర్పించినట్లుగా గుర్తించినా.. వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలను తీసుకోవడం జరుగుతుందన్నారు. అలాంటి వారిపై ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసి.. సీఆర్ పిసి, ఐపీసి సెక్షన్ల కింద జైలు శిక్షతో పాటు.. భారీ మొత్తంలో జరిమానాలను విధించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ భూముల అన్యాక్రాంతానికి పాల్పడే నెరస్థులపై ఎలాంటి ఉదాసీనత వ్యవహరించేది లేదని హెచ్చరికలు జారీ చేస్తూ.. రెవెన్యూ అధికారులు కూడా ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని సూచించారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Indifference to wrongdoers is not to be dealt with.