Natyam ad

200 నాయకులతో వైకాపాలోకి చేరిన ఇందూరు వెంకటరమణారెడ్డి

కండువాలు కప్పి స్వాగతించిన మేకపాటి

నెల్లూరు ముచ్చట్లు:

నెల్లూరు పార్లమెంట్ మాజీ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డిల సమక్షంలో ఆత్మకూరుకు చెందిన  మాజీ వ్యవసాయ కమిటి చైర్మన్ ఇందూరు వెంకట రమణారెడ్డి తన అనుచరులతో వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు.  నెల్లూరులోని మేకపాట నివాసంలో ఆదివారం ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డిని ఇందూరు కలసి శాలువాలతో సన్మానించి పూలమాలలతో సత్కరించారు.ఈ సందర్భంగా తొలుత పార్టీ కండువా కప్పి ఇందూరు వెంకటరమణారెడ్డిని పార్టీలోకి ఆహ్వనించారు.వారి సమక్షంలో వారి అనుచరులకు మేకపాటి విక్రమ్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్ లా ఆంధ్రాకు జీవిత కాలం ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలించడం తధ్యమని అన్నారు.రాష్ట్రాన్ని  ఓ వైపు పారిశ్రామికంగా, మరో వైపు వ్యవసాయ రంగంగా అభివృద్ది చేస్తున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రావడం తధ్యమని, తద్వారా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా తప్పక వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.నియోజకవర్గంలోనే కాకుండా జిల్లాలో,  రాష్ట్రంలో భారీగా వైఎస్సార్ సీపీలో చేరికలు ఉన్నాయని, అందరూ వైఎస్సార్సీపీ వైపే చూస్తున్నారన్నారు. వైఎస్సార్హీపీతోనే  రాష్ట్రం సంక్షేమాభివృద్ది సాధ్యమని  భావించి పార్టీలోకి చేరుతున్నారని తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే విక్రం రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో  టాప్ టెన్ -10లో  ఆత్మకూరు నియోజకవర్గం ఉంటుందన్నారు

 

 

Post Midle

. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలకు ఆయన పాలన పట్ల ఆకర్షితులై వైఎస్సార్సీపీలో చేరుతున్నారని తెలిపారు. ఇతర  పార్టీలో కూడా ప్రభుత్వంపై నమ్మకం పెరిగిందని అన్నారు. ఇంకా చాలా మంది వైఎస్సార్ సీపీలో చేరాలని చూస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆత్మకూరు పట్టణంలో ఉండే పోలింగ్ బూతులలో చాలా చోట్ల తెలుగుదేశం పార్టీకి ఏజెంట్లు కూడా కరవుతారని నూతనంగా వైఎస్సార్హీపీ తీర్థం పుచ్చుకున్న మాజీ ఎంపీ చైర్మన్ ఇందూరు వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ ప్రచారం తక్కువ, పని ఎక్కువ చేసే కుటుంబం మేకపాటి వారిదన్నారు.  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలా కాకుండా ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేశారన్నారు. 1.80 లక్షల ఉద్యోగులు ఇచ్చి ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదేనన్నారు.ఆత్మకూరురూరల్ పరిధిలో త్వరలో ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి సమక్షంలో భారీగా వైఎస్సార్సీపీలో చేరికలు ఉన్నాయని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు నియోజకవర్గం వైకాపా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Indoru Venkataramana Reddy joined Vaikapa with 200 leaders

Post Midle

Leave A Reply

Your email address will not be published.