ఇంద్రకీలాద్రిలో ఘనంగా అక్షరభ్యాసాలు

Date:12/06/2019

విజయవాడ ముచ్చట్లు:

విజయవాడ  శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్దానములో వైభవంగా సామూహిక అక్షరభ్యాసాలు నిర్వహించారు. అక్షర దీవెన కార్యక్రమమునకు దేవాదాయశాఖ మంత్రి   వెల్లంపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిధిగా హజరయ్యారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రావు ,  కార్యనిర్వహణాధికారి  వి.కోటేశ్వరమ్మ  కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అనాధ పిల్లలతో అక్షరాభ్యాసం చేసిన మంత్రి, తరువాత దేవస్థానం తరుపున పూజ సామాగ్రి, స్కూల్ బ్యాగ్, పెన్, శ్రీ అమ్మవారి పాకెట్ ఫోటో, కంకణం, శ్రీ అమ్మవారి ప్రసాదము విద్యార్ధులకు అందజేసినారు. బుధవారం రోజు   అమ్మవారు శ్రీ సరస్వతి దేవి
అలంకారములో దర్శనమిచ్చినారు. భక్తులతో  ఆలయమంతా నిండి పోయింది. ఈ సామూహిక అక్షరభ్యాసములు నందు ఐదు వందల విద్యార్ధులు పాల్గోనినారు. ప్రత్యేక పూజా కార్యక్రమములో  పాల్గోనినారు. కార్యక్రమములో దేవస్ధాన ప్రధాన అర్చకులు, శ్రీ యల్.దుర్గా ప్రసాదుగారు, స్ధానా చార్య,  శివ ప్రసాద్ శర్మ, శ్రీ కోట ప్రసాద్, శ్రీ ఆర్.శ్రీనివాసశాస్త్రి మరియు  వైదిక కమిటీ సభ్యులు వారు,  ఆలయ అర్చక సిబ్బంది, దేవస్ధాన స్పెషల్ డ్యూటీలు చేయు సిబ్బంది ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్, పర్యవేక్షకులు తదితరులు పాల్గొనినారు.

 

తెరుచుకున్న బడులు…ఆరుబయట తరగతులు

Tags: Indrachiladri is a great script

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *