అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సహించం-జిల్లా ఎస్పీ

నందికొట్కూర్ ముచ్చట్లు:


నంద్యాల జిల్లా నందికొట్కూరు సర్కిల్ పరిధిలోని బ్రాహ్మణ కొట్కూరు పోలీస్ స్టేషన్ ను  జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి బుధవారం అకస్మికంగా తనిఖీ చేశారు .ఈ సందర్భంగా స్టేషన్ పరిధిలో ఉన్న కేసుల వివరాలను స్థానిక ఎస్ఐ ఓబులేసు ని అడిగి తెలుసుకున్నారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే ముఠాలు వ్యక్తులపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు .పొరుగు రాష్ట్రమైన తెలంగాణ సరిహద్దు నుండి అక్రమంగా రవాణా చేస్తున్న మద్యం ,తో పాటు స్థానికంగా గ్రామీణ ప్రాంతాలలో బెల్టుషాపు ,నాటుసారా సరఫరా తయారు చేసే నిర్వాహకులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు .ప్రభుత్వం పేదల కొరకై చౌక దుకాణాల ద్వారా సరఫరా చేస్తున్న సబ్సిడీ బియ్యాన్ని ఎవరైనా అక్రమంగా తరలిస్తే వాహనాలను సీజ్ చేయడంతోపాటు వ్యక్తుల పై కేసు నమోదు చేస్తామన్నారు .ఇప్పటికే కొందరి పై అక్రమ బియ్యం సరఫరా చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేయడం జరిగిందన్నారు .

 

 

కరోనా సమయంలో తెలంగాణ నుండి అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్న వ్యక్తుల పై కేసు నమోదు చేయడంతోపాటు వాహనాలను పెద్ద సంఖ్యలో సీజ్ చేయడం జరిగిందని సీజ్ చేసిన వాహనాలను పై  అధికారులతో సంప్రదించి త్వరలోనే వాహనాలపై వేలంపాటనిర్వహిస్తామని  తెలిపారు .బ్రాహ్మణ కోడూరు పోలీస్ స్టేషన్ లోని రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు .పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా తీసుకోవలసిన సూచనలు సలహాలను పోలీసు సిబ్బందికి సూచించారు .పోలీస్ స్టేషన్ ఆవరణంలో పర్యావరణం పరిశుభ్రత పాటించాలని ఆయన తెలిపారు ఎస్పీ వెంట  ఆత్మకూరు డిఎస్పి వై .శృతి ,నందికొట్కూరు రూరల్ సిఐ సుధాకర్ రెడ్డి ,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

 

Tags: Indulging in unsocial activities will not be tolerated-District SP

Leave A Reply

Your email address will not be published.