పుంగనూరుకు పారిశ్రామిక వైభోగం!

-దేశంలోనే అత్యంత కీలక ప్రాజెక్టు పెప్పర్ మోషన్ పరిశ్రమ
-రూ.4,640 కోట్లతో ఏర్పాటు
-పుంగనూరుకు అంతర్జాతీయ ఖ్యాతి
-ఇప్పటికే మూడు పరిశ్రమలు రాక
-ఏర్పాటు దిశగా మరో మూడు పరిశ్రమలు
-పరిశ్రమలకు ఇబ్బంది లేకుండా పుష్కలంగా కృష్ణ జలాలు
-రెండు రిజర్వాయర్ల ద్వారా సరఫరా
-మంత్రి పెద్దిరెడ్డి.. ఎంపీ మిథున్ రెడ్డి కృషితో పుంగనూరుకు మహర్దశ

 

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

నిన్నటిదాకా కరువుకు కేరాఫ్.. దశాబ్దాలుగా పాలించిన పాలకులకు పుంగనూరు అభివృద్ధి పట్టలేదు. అప్పట్లో ఇదో మారుమూల ప్రాంతం. కర్ణాటక సరిహద్దులో ఎవరికి పట్టని పుంగనూరు ఇప్పుడు అంతర్జాతీయ ఖ్యాతిని దక్కించుకోబోతోంది. కరువు ప్రాంతాన్ని తిరగరాసే పారిశ్రామికరణ వైపు దూసుకుపోతోంది. వేల కోట్ల పెట్టుబడులు గంపగుత్తగా తరలివస్తున్నాయి. ఒకప్పుడు మహా నగరాలకే పరిమితమైన పరిశ్రమలు ఇప్పుడు పుంగనూరు వైపు చూస్తున్నాయి. పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో పుంగనూరు పారిశ్రామిక బాట పట్టింది. పారిశ్రామిక వేత్తలను ఆకట్టుకోవడం, పరిశ్రమల స్థాపనకు ఒప్పించడం, ప్రభుత్వ రాయితీలు అందేలా సీఎం జగన్మోహన్ రెడ్డి ద్వారా కృషి చేస్తూ ఎంపీ మిథున్ రెడ్డి పుంగనూరుకు పరిశ్రమలు తీసుకురావడంలో సఫలీకృతులు అవుతున్నారు. ఫలితంగా పుంగనూరు ఉపాధి కల్పన కేంద్రంగా మారిపోతుంది. ప్రపంచ ఖ్యాతి చెందిన పెప్పర్ మోషన్ సంస్థ పరిశ్రమ స్థాపించేందుకు ముందుకు రావడం వెనుక ఎంపీ మిథున్ రెడ్డి దక్షతను నిరూపిస్తోంది. పెప్పర్ మోషన్ సంస్థ రూ.4,640 కోట్లతో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రికల్ బస్సు ట్రక్ క్లస్టర్ పరిశ్రమను స్థాపించేందుకు చర్యలు వేగవంతంగా సాగుతున్నాయి.

 

 

పెప్పర్ తో అంతర్జాతీయ ఖ్యాతి

ప్రపంచంలో విద్యుత్ బస్సులు, ట్రక్కుల తయారీలో పెప్పర్ మోషన్ సంస్థకు పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఈ సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద యూనిట్ ను చిత్తూరు జిల్లా పుంగనూరులో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. రూ.4,640 కోట్లతో ఎనిమిది వందల ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణ యూనిట్ను నెలకొల్పుతోంది. ఇప్పటికే సంస్థ సీఈవో ఆండ్రియాస్ హెగర్ సీఎం జగన్మోహన్ రెడ్డి కలిసి యూనిట్ ఏర్పాటుపై చర్చించారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టేందుకు శుక్రవారం ఈ సంస్థ ప్రతినిధులు పుంగనూరు రానున్నారు. ఈ సంస్థ పుంగనూరు కు రావడం ప్రజల అదృష్టం. 8,100 మంది సాంకేతిక విద్య అభ్యసించిన నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. ప్రత్యక్షంగా మరో ఐదు వేల మందికి ఇతర ఉద్యోగాలు, దీని అనుబంధంగా మరికొన్ని నిర్మాణ రంగ యూనిట్లు రానున్నాయి. వేల సంఖ్యలో ఉద్యోగాలు, కల్పన జరుగుతుంది. దీనిపై ఆధారపడి వేల కుటుంబాలు ఆర్థిక ప్రగతి సాధించనున్నాయి. యూనిట్ ఉత్పత్తి ప్రారంభమయ్యాక సమీపంలోని కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు కేంద్రబిందు కానుంది. వ్యాపార పరంగా ఊహించని అభివృద్ధికి పుంగనూరు కేరాఫ్ గా మారి.. మహర్దశ పడుతుంది.

 

ఇప్పటికే మూడు పరిశ్రమలు

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి కృషితో ఇప్పటికే పుంగనూరుకు మూడు పరిశ్రమలు వచ్చాయి. సుగాలి మిట్ట వద్ద సిలిండర్ల తయారీ సంస్థ జిక్సన్ రూ.57 కోట్లు పెట్టుబడితో పరిశ్రమకు శ్రీకారం చుట్టుంది. అయితే పరిశ్రమ యజమాని రాహుల్ హఠాన్మరణంతో నిర్మాణ పనులు ముందుకు సాగలేదు. ఈ పరిశ్రమ పూర్తయితే ప్రత్యక్షంగా 900 మందికి, పరోక్షంగా వందల మందికి ఉపాధి లభిస్తుంది.
పుంగనూరు మండలంలోని ఆరెడుగుంట వద్ద ఎలక్ట్రో స్టీల్ క్రాసింగ్ లిమిటెడ్ సంస్థ సుమారు రూ‌200 కోట్లతో ఫెర్రో అల్లాయ్ పనులు చేపట్టింది. పైపులు, స్టీల్ ద్వారా తయారయ్యే వస్తువులను ఇక్కడి నుంచి ఉత్పత్తి చేస్తారు. అలాగే అమ్మి గానిపల్లె సమీపంలో గాయత్రి సిలిండర్ల తయారీ పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. ఈ మూడు పరిశ్రమలు నిర్మాణ పనులు పూర్తయితే పుంగనూరు పారిశ్రామిక కేంద్రంగా పేరు ప్రఖ్యాతలు దక్కించుకుంటుంది.

 

మరో మూడు కంపెనీలు

 

పుంగునూరులో మరో మూడు పరిశ్రమలు ఏర్పాటుకు చర్యలు వేగంగా సాగుతున్నాయి. జ్యుట్ ఫ్యాక్టరీ, ఫీడ్ పరిశ్రమ, గ్రానైట్ పరిశ్రమ ఏర్పాటు కానున్నాయి. ఇవన్నీ ఏర్పాటై ఉత్పత్తి ప్రారంభించినటికే పుంగనూరు దేశ చిత్రపటంలో పారిశ్రామిక ప్రగతిలో గుర్తింపు దక్కించుకుంది. పొరుగు రాష్ట్రాలు పుంగనూరు వైపు చూడనున్నాయి.

 

మారనున్న స్థితిగతులు

స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పుంగనూరు పారిశ్రామికరణ వైపు అడుగులు పడలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి అయ్యాక, ఎంపీ మిధున్ రెడ్డి కృషితో పుంగనూరు అన్ని రంగాల్లోనూ ముందుకు సాగుతోంది. మదనపల్లి నుంచి పుంగనూరు వరకు ఉన్న రహదారి జాతీయ రహదారిగా మారి పలమనేరు ఎక్స్ప్రెస్ హైవేలోకి కలుస్తుంది. దీనితో పుంగనూరుకు సమీపంలోనే ఎక్స్ప్రెస్ హైవే ఉండడం అభివృద్ధికి మూలంగా మారింది. ఇతర రంగాల్లోనూ పుంగనూరు గణనీయమైన అభివృద్ధి సాధించింది. ఇప్పుడు పరిశ్రమల రాకతో మరింత ఖ్యాతి దక్కించుకుంటుంది.

 

మంత్రి, ఎంపీ ముందుచూపు

పుంగనూరుకు పరిశ్రమల రాక వెనుక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిల ముందు చూపు ఉంది. పరిశ్రమల రాక అంత సులువు కాదు. పారిశ్రామికవేత్తలను ఆకర్షించడం మహా యజ్ఞం లాంటిది. చిన్న పరిశ్రమ ఏర్పాటు కావాలన్నా ప్రధానంగా నిత్యం అందుబాటులో నీళ్లు, విద్యుత్ ఉండాలి. నీటి సరఫరా, విద్యుత్ సరఫరా లో ఆటంకాలు ఉండరాదు. దీన్ని ముందు అంచనా వేసిన మంత్రి, ఎంపీ పుంగనూరుకు రెండు రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టారు. ఆవులపల్లె, నేతికుంటపల్లె రిజర్వాయర్ల నుంచి పరిశ్రమలకు అందించే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు. రూ.1,500 కోట్ల వ్యయంతో పనులు చేయించారు. వైఎస్ఆర్ జిల్లా గండికోట నుంచి హంద్రీనీవా పుంగనూరు ఉపకాలువ ద్వారా ఈ రిజర్వాయర్లకు కృష్ణా జలాలు అందించే ఏర్పాటు చేశారు. మరి ప్రధానంగా అధిక నీటి వినియోగం కోసం పుంగనూరు ఉపకాలువ విస్తరణ పనులు రూ.1,212 కోట్లతో చేపట్టారు. ఈ పనులు పూర్తయితే కృష్ణా జలాలు పుష్కలంగా పుంగనూరుకు అందుబాటులో ఉంటాయి. పరిశ్రమలకు, తాగు, సాగునీరు, నీటి కొరత అన్నది ఉండదు. పుంగనూరులో పటిష్టమైన విద్యుత్ వ్యవస్థ ఉంది. నిరంతర విద్యుత్ సరఫరా ఉంది. దీనితో పరిశ్రమలకు విద్యుత్ సరఫరా ఆటంకాలు ఉండవు. పరిశ్రమల ఉత్పత్తి చేసిన తమ ఉత్పత్తులను ఎక్స్ప్రెస్ హైవే ద్వారా కర్ణాటక, తమిళనాడుకు సులువుగా రవాణా చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడినుంచి ఎక్కడికైనా ఎగుమతులు చేయగలిగే రవాణా మార్గం ఉంది. ఈ సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావడంలో మంత్రి, ఎంపీ పట్టుదలతో కృషి చేసి సాధించారు.

 

అభివృద్ధి పరుగులు…

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పుంగనూరు అభివృద్ధికి వందల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు. ముప్పె ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని పుంగనూరును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నాం . రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చాం. పరిశ్రమల ఏర్పాటుకు 2000 ఎకరాలను కేటాయించాం. పరిశ్రమల ఏర్పాటుతో పారిశ్రామికంగా పుంగనూరు పరుగులు తీస్తుంది.

-రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

 

నిరుద్యోగ నిర్మూలన …

నియోజకవర్గంలోని నిరుద్యోగులందరికి ఉపాధి కల్పించేలా ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆశీస్సులతో పరిశ్రమల ఏర్పాటు చేపట్టాం. ప్రపంచ ప్రసిద్దిగాంచిన జర్మన్‌ పెప్పర్‌ మోషన్‌ కంపెనీతో 8100 మందికి ఉపాధి కల్పిస్తాం. నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా కృషి చేస్తాం. ముఖ్యంగా ఇక్కడ రెండు రిజర్వాయర్లు నిర్మించి , నీటి సమస్య లేకుండ చేపట్టాం. రహదారులు ఏర్పాటుతో పారిశ్రామిక వేత్తలకు తమిళనాడు, కర్నాటక సరిహద్దులో ఉన్న పుంగనూరు వ్యాపారాలకు అనువైన ప్రదేశంగా గుర్తింపు లభించింది. మరిన్ని పరిశ్రమలు ఏర్పాటుకు కృషి చేస్తాం.

– పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి, ఎంపీ , రాజంపేట.

 

Tags: Industrial prosperity for Punganur!

Post Midle