పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

 

 

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆశీస్సులతోనే పుంగనూరులో పరిశ్రమలు ఏర్పాటు జరుగుతోందని లోక్‌ సభ ప్యానల్‌ స్పీకర్‌, రాజంపేట ఎంపి పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి తెలిపారు. గురువారం మండలంలోని ఎంసి.పల్లె వద్ద రూ.57 కోట్లతో జిక్సిన్‌ ఎండి రాహుల్‌ కరణం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న గ్యాస్‌ సిలిండర్ల పరిశ్రమకు మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపి రెడ్డెప్ప , కలెక్టర్‌ హరినారాయణ్‌, సబ్‌ కలెక్టర్‌ జాహ్నవి, మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్‌బాషాతో కలసి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మిధున్‌రెడ్డి మాట్లాడుతూ పడమటి నియోజకవర్గంగా ఉన్న పుంగనూరులో మంచినీటి కోసం ప్రజలు అవస్థలు పడ్డారని, ఆనాటి ప్రభుత్వాలు పట్టించుకోకుండ నిర్లక్ష్యానికి గురిచేసిందన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పుంగనూరులో అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రణాళిక బద్దంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. పుంగనూరులో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లోఉన్న ఆర్టీసిడిపో, బైపాస్‌రోడ్డు, అగ్రీకల్చర్‌ పాలిటెక్నిక్‌ కళాశాల, వెటర్నరీ కళాశాల , ఉర్ధూ కళాశాలలు మంజూరు చేయడం జరిగిందన్నారు. జిక్సిన్‌ కంపెనీ ద్వారా సుమారు 900 మంది నిరుద్యోగులకు ఉప్యాధి లభిస్తుందని ఈ ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఎంసి.పల్లె వద్ద ఉన్న మరో 100 ఎకరాల భూమిని కూడ పరిశ్రమలకు కేటాయించేలా జిల్లా కలెక్టర్‌ను కోరామన్నారు. పుంగనూరును పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పివైస్‌ పెద్దిరెడ్డి ,మండల అభివృద్ధి కమిటి చైర్మన్‌ అక్కిసానిభాస్కర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, మాజీ చైర్మన్‌ నాగభూషణం, కమిషనర్‌ కెఎల్‌.వర్మ, ఎంపీడీవో రాజేశ్వరి, తహశీల్ధార్లు వెంకట్రాయులు, మాధవరాజు పాల్గొన్నారు.

 

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags: Industries set up in Punganur with Jagannath’s blessings – MP Midhunreddy at Jixin Company event

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *