పెంచిన పెట్రోల్ ,డీజిల్ ధరలను తగ్గించాలి

డోన్ ముచ్చట్లు:

 

డీజల్, పెట్రోల్ ల ధరలు వెంటనే తాగించాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది, స్థానిక
అఖిల భారత కాంగ్రెస్ పార్టీ, మరియు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజ నాధ్ గారు ఆదేశాల మేరకు, నంద్యాల పార్లమెంట్ డిసిసి అద్యక్షులు జంగిటి లక్ష్మీ నరసింహ యాదవ్  పిలుపుమేరకు ,ఈ నెల 7 వ తేదీ నుంచి 17 వ తేదీ వరకు  కేంద్ర ప్రభుత్వం తీసుకొనే ప్రజా  వ్యతి రేఖ విదానాల పై కాంగ్రెస్ పార్టీ పోరు బాట పట్టడం జరిగింది, దేశములో పెరిగిపోతున్న పెట్రోల్ డీజిల్ ధరల కు మరియు నిత్యావసర ధరల పెరుగుదలకు,వంటగ్యాస్ ధరలకు, నిరసనగా
స్థానిక కాంగ్రెస్ పార్టీనంద్యాల పార్లమెంట్ డిసిసి ప్రధాన కార్యదర్శి జి.మద్దులేటి ,కార్యదర్శి యు.జనార్దన్ ల ఆధ్వర్యములో డోన్ పట్టణం లోని ఉన్న పెట్రోల్ బంక్ ల
దగ్గర  సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది,ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ2014లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ రేటు 107 డాలర్లు ఉండగా లీటర్ పెట్రోలు 67 రూపాయలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని ఈనాడు బిజెపి ప్రభుత్వంలో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ 37 డాలర్లు ఉండగా దాదాపుగా 107  రూపాయలు లీటర్ పెట్రోల్ ధరలు పెంచడం చాలా దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు, కావున యావత్ భారతదేశం కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని రాహుల్ గాంధీ గారి నేతృత్వం ఈ దేశంలో ఉండాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని,బడుగు బలహీన వర్గాలు సుఖశాంతులతో ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలని వారు ఆశాభావం వ్యక్తం చేశారు..

 

 

 

సంవత్సరన్నర కాలంగా కరోనా వైరస్ విలయ తాండవం చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం సంవత్సరంలో ప్రతి నెల పెట్రోల్ డీజిల్ పై ధరలు పెంచి ప్రజల నెత్తిన గుదిబండ పడేస్తోంది. పెట్రోల్ డీజిల్ పెంచడం వల్ల దాని ప్రభావం రవాణా రంగంపై పడి దానివల్ల ఆ ప్రభావం నిత్యవసర ధరల పై కూడా పడుతుంది, దీనివల తినడానికి తిండి లేని పేద మధ్యతరగతి కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి వ్యాధుల నుండి రక్షించండి మహాప్రభు అని వేడుకుంటే పుండుపై కారం చల్లినట్టు అన్ని నిత్యావసర  ధరలు పెంచడం, ఇంటి పన్ను, పెంచి,నూతనంగా చెత్త పన్ను వేసి ప్రజల జీవితాలతో ఆడుకుంటుందని వారు విమర్శించారు,ఈ కార్యక్రమములో  ప్యాపిలి మండల, అద్యక్షులు ఎమ్ ఎన్ సుబ్బు యాదవ్ ,  నాయకులు ఎమ్ వెంకటస్వామి, డోన్ మండల అద్యక్షులు వడ్డే రాజశేఖర్, రామభూపాల్ తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: Inflated petrol and diesel prices should be reduced

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *