దిశా ద్వారా సమాచారం యువతిని కాపాడిన పోలీసులు

గుంటూరు ముచ్చట్లు:

 

గుంటూరు జిల్లా లో ఒక యువతి దిశా యాప్ కు పంపిన సమాచారంతో పోలీసులు వెంటనే స్పందించారు.  రొంపిచర్ల మండలం నల్లగార్లపాడు గ్రామానికి చెందిన యువతి  తన సోదరుడితో కలసి శుక్రవారం  కోటప్పకొండ దర్శనానికి వెళ్లింది. అక్కడ  కొంతమంది ఆకతాయిలు ఆ యువతిని వేధిస్తుండగా ఆ యువతి తన మొబైల్ లో దిశా యాప్ ద్వారా పోలీసులకు సమాచారం అందజేసింది. 15 నిమిషాల్లో నర్సరావుపేట రూరల్ ఎస్సై లక్ష్మీ నారాయణ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని ఆకతాయిలు నుంచి యువతిని రక్షించారు. అ  సమయం లో దిశ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో దిశ యాప్ గురించి పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహిస్తుండగా దిశా యాప్ ద్వారా కంప్లైంట్ రావడంతో హుటాహుటిన రూరల్ ఎస్ఐ వెళ్లి ఆకతాయిల నుంచి యువతి ని కాపాడారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: Information by Disha The police who rescued the young woman

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *