కృష్ణనగర్ ఫారెస్టు ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కల్పించాలి :- సిపిఎం

తాడేపల్లి ముచ్చట్లు:
 
పట్టణంలోని కృష్ణ నగర్ ఫారెస్టు ప్రాంతం అయిన సుందరయ్య ప్రెస్ కాలనీ, శివదుర్గా పురం, పి. వి నగర్, రామయ్య కాలనీ, లెనిన్ నగర్, ఇస్లాం పేట, రాజీవ్ కాలనీ, ఇండస్ట్రియల్ కాలనీలలో రోడ్లు, డ్రెయినేజీలు మొదలైన అభివృద్ధి పనులు చేపట్టాలని కోరుతూ ఉదయం సిపిఎం నాయకులు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ని తాడేపల్లిలో కలిసి అర్జీ ఇచ్చారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ తప్పని సరిగా ఆ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఎమ్మెల్యే ని కలిసిన వారిలో సిపిఎం నాయకులు దొంతిరెడ్డి వెంకటరెడ్డి, బూరుగ వెంకటేశ్వర్లు, వేముల దుర్గారావు, కొట్టె కరుణాకరరావు, సోలా ముత్యాలరావు, బి. ఏషియా ఉన్నారు.
పుంగనూరులో రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్లకు తీవ్ర గాయాలు
Tags: Infrastructure should be provided in Krishnanagar Forest area: – CPM

Natyam ad