హత్యాయత్నాన్ని ఖండించిన మంత్రి వేముల
హైదరాబాద్ ముచ్చట్లు:
ఆర్మూర్ శాసనసభ్యుడు నిజమాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీవన్ రెడ్డి పై హత్య కుట్ర యత్నాన్ని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. నిరంతరం ప్రజా క్షేత్రంలో ఉండే ఎమ్మెల్యే జీవన్ రెడ్డి లాంటి వారిపై హత్య కుట్రకు పూనుకోవడం హేయమైన చర్య అని మండిపడ్డారు.విషయం తెలిసిన మంత్రి బంజారాహిల్స్ లోని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనకు సంఘీభావం తెలిపారు. దైర్యంగా ఉండాలన్నారు. సంఘటన సంబందించిన విషయాలను ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు.
Tags:Minister Vemula condemned the assassination attempt