దీక్షాదారులకు ఆలయంలోకి అనుమతించని వైనం
-నిరసనకు దిగిన దీక్షాదారులు
నల్గోండ ముచ్చట్లు:
నల్లగొండ జిల్లా దీక్షాదారులు నిరసనకు దిగారు. హాలియాలో అయ్యప్ప, ఆంజనేయ, భవాని, , శివ స్వాముల ఆధ్వర్యంలో ప్రధాన కూడలి నుండి శివాలయం వరకు స్వాములు ర్యాలీ నిర్వహించి ధర్నా కు దిగారు. స్థానిక శివాలయంలోకి వచ్చిన స్వాములపై ఆలయ ధర్మకర్త కేసులు పెట్టాడని ఆరోపించారు. తమను ఆలయ ధర్మకర్త ఆలయంలోకి స్వాములను అనుమతించలేదని వారు అన్నారు. వెంటనే అధికారులు వచ్చి మాకు న్యాయం చెయ్యకపొతే.. స్వాముల అందరం సాగర్ ఎడమ కాలువలోకి దూకుతామని హెచ్చరించారు. ఈ నేపధ్యంలో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

Tags: Initiates are not allowed to enter the temple
