కాంగ్రెస్ దీక్ష

మంచిర్యాల ముచ్చట్లు :

 

రాష్ట్రంలో పేదలకు కరోనా, బ్లాక్ ఫంగస్ వైద్యం ఉచితంగా అందించాలని డిమాండ్ చేస్తూ సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. ఈ ఒక రోజు దీక్షలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావుతో పాటు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యంతో దేశంలో అనేక మంది కరోనా, బ్లాక్ ఫంగస్ వ్యాధుల బారిన పడి చనిపోతున్నారని ఆరోపించారు. ఒకవైపు ఎన్నికలు, కుంభమేళా నిర్వహించడం వల్ల దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి పెరిగిందని ఆమె తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్, బ్లాక్ ఫంగస్ కు సరైన వైద్యం అందుబాటులో లేక ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లే బాధితులను ఆర్థికంగా దోపిడీ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఆసుపత్రికి వెళితే ఆస్తులు అమ్ముకోవాలని సాక్షాత్తు ముఖ్యమంత్రి అనడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నా అరికట్టడంలో మాత్రం ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆమె పేర్కొన్నారు. వెంటనే రాష్ట్రంలో పేద ప్రజలకు కరోనా, బ్లాక్ ఫంగస్ కు ఉచితంగా వైద్యం అందించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు రాజేశ్వర్ రావు, పట్టణ అధ్యక్షులు అంకం నరేష్ రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి అర్కల హేమలత, మహిళ జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అద్యక్షులు, కౌన్సిలర్ సల్ల మహేశ్, తదితరులు పాల్గొన్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags; Initiation of Congress

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *