రైతులకు న్యాయం చేయాలని దీక్ష

Date:05/05/2020

హైద్రాబాద్ ముచ్చట్లు:

పంటల సేకరణ, వ్యవసాయోత్పత్తుల కొనుగోళ్లలో తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా టీపీసీసీ నేతలు  రైతు సంక్షేమ దీక్ష చేపట్టారు. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దీక్ష చేశారు.. అన్ని జిల్లాల డీసీసీ కార్యాలయాల్లో దీక్షలు చేపట్టారు. దీక్ష సమయంలో కచ్చితంగా భౌతిక దూరం పాటించాలని ఆయన కోరారు. కాగా, కరోనా వైరస్‌ కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అశాస్త్రీయంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్‌ పార్టీ  గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ దృష్టికి తీసుకెళ్లింది.రాష్ట్రంలో కరోనా వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు, ఆకలి, రైతు, వలస కూలీల అవస్థల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా మంగళవారం టీజేఎస్‌ ఆధ్వర్యంలో మౌన నిరసన దీక్ష నిర్వహించనున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జి.వెంకట్‌రెడ్డి  ప్రకటనలో తెలిపారు. పార్టీ కార్యాలయంలో టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం నేతృత్వంలో ఈ దీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి, రైతు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టేలా చూడాలని అఖిలపక్ష నాయకులు సోమవారం రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.

మందు బాబులు క్యూ కడుతున్నారు

Tags: Initiation of justice for farmers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *