కొనసాగుతున్న న్యాయవాదుల దీక్ష
హుస్నాబాద్ ముచ్చట్లు :
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో సబ్ కోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష 9 వ రోజు కొనసాగుతోంది. న్యాయవాదుల దీక్షకు అఖిలపక్ష, ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. కోర్టులో విధులు బహిష్కరించి 9 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కానీ, జ్యుడీషియల్ వ్యవస్థ కానీ స్పందించడం లేదని న్యాయవాదులు వాపోయారు. 450 కేసులతో ఉన్న హుస్నాబాద్ కోర్టును, సబ్ కోర్టు గా ఏర్పాటుకు చెయ్యడానికి అన్ని అర్హతలు కలిగి ఉందన్నారు. గత ఆరు నెలలుగా సబ్ కోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యేకు, న్యాయశాఖ మంత్రికి, జ్యుడీషియల్ అధికారులకు దరఖాస్తు ఇచ్చి విన్నవించిన ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదన్నారు. లా సెక్రెటరీ నుండి ప్రకటన వచ్చేవరకు తమ దీక్షను కొనసాగిస్తామన్నారు. దీక్ష ఇలాగే కొనసాగితే కక్షిదారులు నష్టపోయే అవకాశం ఉందని, రాష్ట్ర ప్రభుత్వం, జ్యుడీషియల్ అధికారులు స్పందించి తక్షణమే లా సెక్రటరీ ద్వారా సబ్ కోర్ట్ మంజూరు చేయించాలని కోరారు. న్యాయవాదుల దీక్షకు జనసేన పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు.
Tags: Initiation of ongoing lawyers

