టీడీపీ నారీ సంకల్ప దీక్ష ప్రారంభం

అమరావతి ముచ్చట్లు:
 
టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రారంభమైన టీడీపీ నారి సంకల్ప దీక్ష ప్రారంభమయింది. తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆధ్వర్యంలో సంకల్ప దీక్ష కొనసాగింది. సంకల్ప దీక్ష నేపథ్యంలో జిల్లాల్లో ఆదివారం రాత్రి నుండి పోలీసులు  ఆంక్షలు విధించారు. సంకల్ప దీక్షకు హాజరుకాకుండా జిల్లాల నుండి వస్తున్న తెలుగు మహిళలను అడ్డుకున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని  తెలుగు మహిళలు అంటున్నారు. మహిళల్లో ఒక ధైర్యం నింపేందుకు సంకల్ప దీక్ష చేపట్టామని వారంటున్నారు.వంగలపూడి అనిత మాట్లాడుతూ సీఎం ఒక సైకో. సీఎం ఒక మహిళా ద్రోహి. రెండున్నర ఏళ్ళు సీఎంలో మార్పు వస్తుంది అని ఆశించాం. పాదయాత్ర లో ముద్దులు పెట్టి నేడు గుద్దులు గుద్దుతున్నాడని అన్నారు. మద్యం ఎక్కువ రేట్లకు అమ్ముతూ మహిళల మెడలోని పుస్తెలు తెంచుతున్నాడు. ప్రతి రోజు మహిళలపై వేధింపులు కొనసాగుతున్నాయని ఆరోపించారు.
హోంమంత్రి సుచరిత ఒక నిస్సహాయ మంత్రి. గన్ మ్యాన్ ల కోసమే సచరితకు హోంమంత్రి పదవి ఇచ్చారని అన్నారు.
గుండెపోటుతో నిరుద్యోగి మృతి
Tags; Initiation of TDP Nari Sankalpa Deeksha