సజ్జాబండల కూలీ వృద్ధురాలికి గాయాలు

Date:22/10/2019

బి.కొత్తకోట ముచ్చట్లు:

ఇంటి ముందు నిద్రిస్తున్న వృద్ధురాలిపై ఇంటి సజ్జాబండలు కూలడంతో తీవ్రంగా గాయపడిన సంఘటన సోమవారం రాత్రి మండలంలోని కొత్త ఒడియంలో జరిగింది. గ్రామానికి చెందిన జి.జయరామచంద్ర ఇంటికి వర్షపునీరు పడకుండ ఉండేందుకు సజ్జా బండలు వేశారు. సోమవారం రాత్రి జయరామచంద్ర తల్లి మంగమ్మ (80) ఇంటి ముందు నిద్రిస్తోంది. బండలు ఒక్కసారిగా కూలిక్రిందపడ్డాయి. దీంతో నిద్రిస్తున్న మంగమ్మ తలపై పడి తీవ్రంగా గాయపడింది. చికిత్స కోసం స్థానిక ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మదనపల్లెకు తరలించారు.

 

తంబళ్లపల్లెకు గండికోట నీరు

Tags: Injuries to elderly women

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *