లారీ, బస్సు ఢీ…ప్రయాణికులకు గాయాలు

యాదాద్రి ముచ్చట్లు:
 
యాదాద్రి-భువనగిరి జిల్లా పరిధిలోని.. మోత్కూర్ మండలం, అనాజిపురం వద్ద ఆర్టీసీ  బస్సును, లారీ ఢీ కొట్టింది. ఈ  ఘటనలో పెను ప్రమాదం తప్పగా.. బస్సులోని పలువురు ప్రయాణికులకి, లారీ డ్రైవర్ కి స్వల్ప గాయాలు అయ్యాయి. అనాజిపురం చౌరస్తా వద్ద బస్సు వెళుతుండగా ఇసుక లోడుతో వెళ్తున్న లారీ టర్న్ తీసుకునే క్రమంలో ఒక్కకసారిగా వేగంగా వచ్చి ఢీకొట్టింది. లారీ డ్రైవర్ అజాగ్రత్త ప్రమాదానికి కారణమని.. బస్సు డ్రైవర్, ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
 
Tags: Injuries to lorry and bus passengers

Leave A Reply

Your email address will not be published.