తేనేటీగాల దాడిలో కార్మికులకు గాయాలు

Injuries to workers in the honey bee attack

Injuries to workers in the honey bee attack

Date:16/03/2018
మంచిర్యాల ముచ్చట్లు:
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం లోని శాంతి గని మైన్ పై సింగరేణి కార్మికులపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటనలో సుమారు 30 మంది కార్మికులకు గాయాలు అయ్యాయి. వెంకటేష్ అనే కార్మికునికి పరిస్థితి విషమంగా ఉంది. వీరందరినీ  సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సింగరేణి శాంతి గని మైన్ పై  కార్యాలయ ఆవరణలో గల చెట్ల పై ఉన్న  తేనె తేట్టెను  కోతులు కదిలించాయి.  నైట్ షిఫ్ట్ ముగించు కొని బయటకు వచ్చే  కార్మికులు , ఉదయం విధులకు హాజరు అయ్యే కార్మికుల తో గని అవరణం సందడిగా ఉన్న సమయం లో  ఒక్కసారిగా తేనెటీగల దాడి జరిగింది.  తేనెటీగల దాడిలో సుమారు 30 మందికి పైగా కార్మికులకు గాయాలయ్యాయి. వెంకటేష్ అనే కార్మికుని పరిస్థితి విషమంగా ఉండటం తో మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ కు తరలించారు. తేనెటీగల దాడిని గని ప్రమాదం గా గుర్తించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గని ఆవరణ లో ఉన్న చెట్ల పై తేనెటీగల ను తొలగించాలని పలు మార్లు కార్మికులు చెప్పిన యాజమాన్యం పట్టించు కోలేదని కార్మికులు ఆరోపిస్తున్నారు.
Tags: Injuries to workers in the honey bee attack

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *