మంజూ వారియర్ కు గాయం

Date:06/12/2018
చెన్నై ముచ్చట్లు:
మాలీవుడ్ స్టార్ హీరోయిన్ మంజూ వారియర్‌ షూటింగ్‌లో గాయపడింది. తమిళ స్టార్ దర్శకుడు సంతోష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జాక్ అండ్ జిల్’ మూవీ షూటింగ్‌లో యాక్షన్ సన్నివేశంలో భాగంగా మంజూ వారియర్ కింద పడిపోవడంతో తలకు బలమైన గాయమైంది. దీంతో దగ్గరలోని ప్రైవేట్ హాస్పటల్‌కి తరలించారు. తీవ్రంగా రక్తస్రావం కావడంతో పాటు తలకు 10 పైగా కుట్లు పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి షూటింగ్‌కి వాయిదా పడగా.. మంజూ వారియర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది చిత్ర యూనిట్.  మంజూ వారియర్ వరుస చిత్రాలతో లేడీ సూపర్ స్టార్‌గా మాలీవుడ్‌లో సత్తా చాటుతోంది. మోహన్ లాల్‌తో జోడీ కట్టిన ‘ఓడియన్’ ఈ నెల 14న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. దీంతో పాటు లూసిఫర్, జాక్ అండ్ జిల్ షూటింగ్ దశలో ఉన్నాయి. ఇటీవల లైంగిక ఆరోపణ కేసులో జైలుకి వెళ్లొచ్చిన మలయాళ స్టార్ హీరో దీలీప్‌ మొదటి భార్యే మంజూ వారియర్.
Tags:Injury to warrior

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *