Natyam ad

లోతట్టు ప్రాంతాలుజలమయం

హైదరాబాద్ ముచ్చట్లు:


సోమవారం రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయమయ్యాయి. సరూర్ నగర్ చెర్వుకట్ట దిగువ ఉన్న , కోదండరాం నగర్ , పూసల బస్తి కాలనీలు మొత్తం నీట మునిగాయి. నివాసలలోకి వరద నీరు చేరడంతో రాత్రంతా ప్రజలు , చిన్న పిల్లలు , వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతూ , జాగారం చేస్తూ , పాములు , తేళ్ళు వస్తాయేమోనని తెల్లవార్లు మేలుకువతోటే గడిపారు. వర్షం చిరుజల్లులు అయినా,  భారీ వర్షం అయినాన మా పరిస్థితి ఇలాగే ఉంటుందని స్థానికులు వాపోయారు.  ఎంతమంది ప్రజాప్రతినిధులు వచ్చినా,  ఎంతమంది అధికారులు , సిబ్బంది మారినా మా పరిస్థితులలో ఎలాంటి మార్పు రావడం లేదని , శాశ్వత పరిష్కారం చూపడం లేదని లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆవేదన వ్యక్తంచేశారు.

 

Tags: Inland areas are waterlogged

Post Midle
Post Midle