Natyam ad

రామసముద్రంలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఇన్నోవా కారు- ఒకరు మృతి

-ఇంకొకరికి తీవ్ర గాయాలు

 

రామసముద్రం ముచ్చట్లు:

Post Midle

రామసముద్రం మండలం కర్ణాటక రాష్ట్ర సరిహద్దు అయిన కురిజల పంచాయతీ గుట్టపాళ్యం కు వెళ్లే రోడ్డు మార్గంలో రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా,. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్ ఐ రవీంద్రబాబు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం మధ్యాహ్నం రామసముద్రం బజారు వీధికి చెందిన శివారెడ్డి సొంత పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై కర్ణాటక రాష్ట్ర సరిహద్దు లోగల గుట్టపాళ్యం వెళ్లి తిరిగి రామసముద్రం వస్తుండగా గుట్టపాళ్యం కు చెందిన తిమ్మయ్య కుమారుడు కృష్ణప్ప (60) తానూ రామసముద్రం వస్తానని శివారెడ్డి ద్విచక్ర వాహనంపై కూర్చున్నాడు. ఇద్దరు రామసముద్రం వస్తుండగా మార్గమధ్యంలో ఎదురుగా వస్తున్న ఇన్నోవా కారు ద్విచక్ర వాహనాన్నీ డీ కొనడంతో కృష్ణప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో శివారెడ్డి కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఎస్ ఐ రవీంద్రబాబు తమ సిబ్బంది తో సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన శివారెడ్డి ని మెరుగైన చికిత్స నిమిత్తం తిరుపతికి తరలించారు. మృతి చెందిన కృష్ణప్ప ను పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య,ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Tags: Innova collides with a two-wheeler in Ramasamudra – one killed

Post Midle

Leave A Reply

Your email address will not be published.