Natyam ad

ప్రతిభని వెలికి తీయడానికి ఇంటింటా ఇన్నోవేటర్ ఆవిష్కరణలు- జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ

పెద్దపల్లి ముచ్చట్లు:


ప్రతిభని వెలికి తీయడానికి ఇంటింటా ఇన్నోవేటర్ ఆవిష్కరణలు కార్యక్రమం చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ తెలిపారు. మంగళవారం తన ఛాంబర్ లో ఏర్పాటు చేసిన పోస్టర్ ఆవిష్కరణలో పాల్గొని మాట్లాడారు. ఆగస్టు 5  వరకు ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంలో పాల్గొనేవారు తమ వివరాలు పంపాలని, జిల్లాలోని గ్రామీణ,పట్టణ ఔత్సాహికులు ఆవిష్కరణలలో తమ ప్రతిభను చాటుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగేళ్లుగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటా ఇన్నోవేషన్ కార్యక్రమం చక్కని వేదికగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్  అన్నారు. ఈ ప్రదర్శన జిల్లా స్థాయిలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉంటుందని, పౌరులు, ఆవిష్కర్తల మధ్య అనుసంధానం కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రదర్శనలో పాల్గొనడానికి అన్ని రంగాల, వర్గాల ఆవిష్కరణలను ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. ఆవిష్కర్తలు తమ ఆవిష్కరణకు సంబంధించిన 6 వాక్యాలు, 2 నిమిషాల వీడియోను, ఆవిష్కరణ యొక్క 4 ఫోటోలు, ఆవిష్కర్త పేరు, ఫోన్ నెంబర్, వయసు, ప్రస్తుత వృత్తి, గ్రామం పేరు, జిల్లా పేరు తదితర వివరాలను వెంటనే  9100678543 కి వాట్సాప్ చేయాలని కలెక్టర్ తెలిపారు. మరిన్ని వివరాలకు జిల్లా సమన్వయకర్త బి.రవినందన్ రావును 9951504622 నెంబర్ లో సంప్రదించాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ, జిల్లా విద్యాశాఖాధికారి డి.మాధవి, ఈడిఎం కవిత,జిల్లా సైన్స్ అధికారి బి.రవినందన్ రావు, డి.సి.ఇ.బి అదనపు కార్యదర్శి ఎం.నరేష్,యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Innovator inventions from home to unearth talent- District Collector Sangeetha Satyanarayana

Post Midle
Post Midle