Date:24/01/2021
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణ సమీపంలోని నక్కబండలో ఇండ్ల స్థలాల గోల్మాల్పై పూర్తి స్థాయి విచారణ చేపడుతున్నట్లు తహశీల్ధార్ వెంకట్రాయులు తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ నక్కబండలో అనర్హులు ఎవరున్నా ఇండ్ల పట్టాలను రద్దు చేసి, ఆ స్థలాలను స్వాధీనం చేసుకుని, అర్హులైన పేదలకు అందజేస్తామన్నారు. గత కొన్ని సంవత్సరాల క్రితం ఇండ్ల పట్టాలు అనర్హులు బినామిల పేరుతో పట్టాలు పొందినట్లు ఫిర్యాదులు అందిందన్నారు. దీనిపై మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు కలసి సంయుక్తంగా సర్వే నిర్వహిస్తామన్నారు. అనర్హులు ఎవరున్నా వదిలిపెట్టే ప్రసక్తేలేదని, నిబంధనల మేరకు పట్టాలు పంపిణీ చేసిన వారందరికి స్థలాలు చూపిస్తామని , ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు.
శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
Tags: Inquiry into the sites of houses at Nakkabanda in Punganur