Natyam ad

పుంగనూరులో సిలిండర్ల పరిశ్రమకు భూమిని పరిశీలించండి-ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్‌

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండలం ఆరడిగుంట వద్ద గ్యాస్‌ సిలిండర్ల పరిశ్రమకు భూమిని కేటాయించేందుకు అనువైన స్థలాన్ని పరిశీలించాలని జిల్లా కలెక్టర్‌ హరినారాయణ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మదనపల్లెకు చెందిన గాయిత్రి గ్యాస్‌ సిలిండర్ల పరిశ్రమ చైర్మన్‌ జబ్బాల శ్రీనివాసులు గత వారం రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తిరుపతిలో కలిశారు. ఈ మేరకు పుంగనూరులో గ్యాస్‌ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు భూమిని కేటాయించాలని కోరారు. మంత్రి ఆదేశాలపై కలెక్టర్‌ పలమనే రు ఆర్‌డీవోను ఆర డిగుంటకు వెళ్లి పరిశ్రమకు అవసరమైన 57 ఎకరాల భూమిని పరిశీలించి నివేదికలు పంపాలని ఆదేశించారు. దీనిపై జబ్బాల శ్రీనివాసులు విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిల ఆదేశాల మేరకు గ్యాస్‌ సిలిండర్ల పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ పరిశ్రమ ద్వారా సుమారు 2500 మందికి దశల వారిగా ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఇందుకు గాను సుమారు రూ.80 కోట్లతో పరిశ్రమ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు.

 

Post Midle

Tags: Inspect land for cylinder industry at Punganur-Collector issued orders

Post Midle