భూ వినియోగం మరియు భూ వర్గీకరణ తనిఖీ
నందికొట్కూర్ ముచ్చట్లు:
వ్యవసాయ గణన 1.0 నిమిత్తం పగిడ్యా ల మండలంలో ఎన్నికైన ముచ్చుమర్రి గ్రామమునకు నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ నుండి అధికారిణి కే అమృత , సూపరిండెంట్ పి జయరాములు. ఎస్ ఎస్ ఓ , ముఖ్య ప్రణాళిక కార్యాలయం నంద్యాల నుండి అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్ వసంత కుమారి, జిల్లా వ్యవసాయ కార్యాలయం నుండి వ్యవసాయ అధికారి కే కళ్యాణ్ కుమార్. మంగళవారం నాడు ముచ్చుమర్రి గ్రామానికి వచ్చారు. విచారణకు ఎన్నికైన సర్వే నెంబర్లకు సంబంధించి భూ వినియోగం, భూ వర్గీకరణ తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేసారు. ఈ క్రాప్ బుకింగ్ తో అడంగల్ లో నమోదు చేసిన విస్తీర్ణంకు సరిపోల్చడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పి విజయ జ్యోతు కుమార్, సహాయ గణాంక అధికారి రవి ప్రకాష్, ముచ్చుమర్రి గ్రామ రెవెన్యూ అధికారులు నరసింహులు,మద్దిలేటి, గ్రామ వ్యవసాయ సహాయకులు పుష్ప, వివేక్, గ్రామ సర్వేయర్లు మహేష్ ,నవీన్, వి.ఆర్.ఎ లు సంబంధిత రైతులు పాల్గోన్నారు.
Tags: Inspection of land use and land classification

